రెహ్మాన్ ని ఆ ప్రశ్న మాత్రం అడగకూడదట!

Published : Sep 26, 2018, 03:29 PM IST
రెహ్మాన్ ని ఆ ప్రశ్న మాత్రం అడగకూడదట!

సారాంశం

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ తాజాగా మణిరత్నం రూపొందించిన 'నవాబ్' సినిమాకి సంగీతం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెహ్మాన్ మీడియా వర్గాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూలు అన్నీ ఒక షరతు మీద జరిగినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. ఇంటర్వ్యూలో ఎవరూ కూడా 'సై రా' గురించి మాత్రం అడగకూడదట.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ తాజాగా మణిరత్నం రూపొందించిన 'నవాబ్' సినిమాకి సంగీతం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెహ్మాన్ మీడియా వర్గాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూలు అన్నీ ఒక షరతు మీద జరిగినట్లు తెలుస్తోంది.

అదేంటంటే.. ఇంటర్వ్యూలో ఎవరూ కూడా 'సై రా' గురించి మాత్రం అడగకూడదట. 'సై రా' సినిమాకు రెహ్మాన్ కి ఉన్న సంబంధం ఏంటి అనుకుంటున్నారా ..? ముందుగా 'సై రా' సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ ని అనౌన్స్ చేశారు. కానీ సడెన్ గా ఆయన సినిమా నుండి తప్పుకొని షాక్ ఇచ్చారు.

ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే ప్రశ్న రెహ్మాన్ కి పదే పదే ఎదురవుతుండడంతో ఈ ప్రశ్న అడగొద్దని పీఆర్ టీమ్ కి ముందే హింట్ ఇచ్చాడట.

దీంతో 'సై రా' కి సంబంధించిన ప్రశ్నలు అడగకుండానే ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. ఇక 'నవాబ్' సినిమాకు రెహ్మాన్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకునే స్థాయిలో లేదు. ప్రస్తుతం అతడు విజయ్ నటిస్తోన్న తమిళ చిత్రం 'సర్కార్' కి సంగీతం అందిస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?
Prabhas: 2025 లో ఒక్క మూవీ లేని హీరో, కానీ చేతిలో 4000 కోట్ల బిజినెస్.. ఆ రెండు సినిమాలపైనే అందరి గురి ?