
దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్ ఇంక అయిపోయింది అని అందరూ మాట్లాడుకుంటున్న టైంలో సరిగ్గా అప్పుడే ఎవ్వరు ఊహించని విధంగా వరుణ్ తేజ్‌తో మిస్టర్ సినిమాను మొదలుపెట్టాడు. ఆగడు..ఫ్లాప్ తర్వాత చాలా విమర్శలు , గొడవల మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో బ్రూస్‌లీ సినిమా తెరకెక్కించాడు శ్రీను వైట్ల ..అందులో మెగాస్టార్ కూడా కొన్ని నిముషాలు ఓ చిన్న పాత్రలో సందడి చేశాడు అయినా లాభం లేక పోయింది దాంతో మళ్లీ ఆగడు రిజల్ట్ రిపీట్ అయ్యింది. సో ఇప్పుడు వైట్ల హోప్స్ అన్ని కూడా మిస్టర్ సినిమాపైనే పెట్టుకున్నాడు.
అటు వరుణ్ పరిస్థితి కూడా కాస్త కష్టంగానే ఉంది ఫ్యాన్స్ దగ్గర రిజిస్టర్ అయినా ఇంకా స్టార్ స్టేటస్ కాని మినిమమ్ గ్యారంటీ హీరో అని కాని అనిపించుకోలేక పోయాడు . నటుడిగా కంచెలాంటి సినిమాలో అదరగొట్టినా పెద్ద కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు సో వరుణ్‌కి కూడా మిస్టర్ హిట్ చాలా ముఖ్యం లేదంటే కమర్షియల్ హిట్స్ దూరమైపోయే ప్రమాదం ఉంది.
మరి ఈ ఇద్దరి కెరీర్ ను మిస్టర్ గాడిలో పెడుతుందో లేదో తెలియాలి అంటే ఏప్రిల్ 14 వరకు ఆగాల్సిందే...సంగీతం, డైలాగ్స్ అంచనాలను పెంచడంతో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అని ఫిక్స్ అయినా మెగా అభిమానుల నమ్మకాన్ని ఎంత వరకు నిలబెడుతుందో చూడాలి.