'96' రీమేక్ : డైరక్టర్ కు, దిల్ రాజుకు అభిప్రాయ భేదాలు!

By Udaya DFirst Published 18, Feb 2019, 7:55 AM IST
Highlights

దిల్ రాజు ప్రతీ విషయంలోనూ కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలతో ఉంటారు. నిర్మాత అంటే కేవలం డబ్బు పెట్టే క్యాషియర్ అని కాకుండా కథ, టెక్నిషియన్స్ ఎంపిక, పబ్లిసిటి ఇలా ప్రతీ విషయంలోనూ తనదైన ఆలోచనలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూంటారు.

దిల్ రాజు ప్రతీ విషయంలోనూ కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలతో ఉంటారు. నిర్మాత అంటే కేవలం డబ్బు పెట్టే క్యాషియర్ అని కాకుండా కథ, టెక్నిషియన్స్ ఎంపిక, పబ్లిసిటి ఇలా ప్రతీ విషయంలోనూ తనదైన ఆలోచనలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూంటారు. అయితే ఇది కొందరు దర్శకులకు ఇబ్బంది కలిగిస్తూంటుంది. ఇప్పుడు 96 తెలుగు రీమేక్ కు అదే సమస్యగా మారుతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. 

వివరాల్లోకి వెళితే..విజయ్ సేతుపతి, త్రిష జంటగా తమిళం లో నటించిన చిత్రం 96. ఈ చిత్ర టీజర్ చూసి సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరిలో నమ్మకం కలిగింది. తెలుగు నిర్మాత దిల్ రాజు సైతం ఈ టీజర్ కు ఫిదా ఆయె వెంటనే ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకున్నాడు. అందరూ అనుకున్నట్లే ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్ అయి అందరి నమ్మకం నిలబెట్టింది.

ఇక ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించాలని  నాని.. అల్లు అర్జున్.. గోపీచంద్.. ఇలా చాలా మందినే ట్రై చేసి చివరకు శర్వానంద్ ని ఫైనలైజ్ చేసారు. అలాగే త్రిష చేసిన పాత్రకు సమంత అయితే పర్ఫెక్ట్ గా సరిపోతారని రాజు ఫిక్స్ అయ్యారు.  తమిళ వెర్షన్ రూపొందించిన ప్రేమ్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహించమనిఆఫర్ చేసారు. అంతా బాగానే ఉంది కానీ ఆ దర్శకుడుతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తున్నాయని వినికిడి. 

డైరక్టర్ తనకు తమిళంలో ఇచ్చిన మ్యూజిక్ డైరక్టర్ గోవింద వసంత ను ఫైనల్ చేద్దామంటారు. దిల్ రాజు తెలుగులో టాప్ మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ ని  ప్లాన్. దానికి డైరక్టర్ ఒప్పుకోవటం లేదు. అలాగే తెలుగు ఆడియన్స్ కు నచ్చే విధంగా కొన్ని మార్పులు తెలుగులో చేయాలని దిల్ రాజు చెప్పారట. యాజటీజ్ తను ఏదైతే తమిళంలో చేసానో అదే చేస్తానని దర్శకుడు పట్టుదలతో ఉన్నారట. ఇలా చాలా విషయాల్ల క్రియేటివ్ డిఫరెన్సెలు వస్తున్నాయట. డిఫరెన్సెస్ లు వస్తున్నాయంటే దిల్ రాజు ఎంతలా ఆ సినిమాను ప్రేమించారో అర్దమవుతోంది. కాబటట్టి ఖచ్చితంగా అద్బుతమైన అవుట్ ఫుట్ వస్తుందనటంలో సందేహం లేదు. 

 

Last Updated 18, Feb 2019, 7:59 AM IST