ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో 94వ ఆస్కార్ అవార్డుల వేడుక ప్రత్యేక సందేశాన్ని పంపించింది. ఉక్రెయిన్ కి అండగా నిలవాలని కోరుకుంది. వారిని ఆదుకోవాలని వెల్లడించింది.
ఉక్రెయిన్-రష్యా (Ukraine-Russia War) వారి గత నెల రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ (Ukraine)ని తన ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా(Russia) ప్రయత్నిస్తుంది. ప్రపంచ శాంతికి తూట్లు పొడుస్తూ, అనేక నిబంధనలు కాదని ఆదిపత్యం కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నారు. ప్రపంచ దేశాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఖాతరు చేయడం లేదు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ చాలా వరకు దెబ్బతిన్నది. ఉక్రెయిన్ ప్రధాన నగరమైన కీవ్ ఆక్రమించుకునేందుకు రష్యా పోరాడుతుంది. ఈ క్రమంలో చాలా నష్టం జరిగింది. ఆస్తి నష్టాలే కాదు, భారీగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.
అంతర్జాతీయ ఉమెన్ రైట్స్ సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం 1119 మంది ఉక్రెయిన్ అమాయక ప్రజలు కన్నుమూసినట్టు తెలుస్తుంది. అలాగే 1790 మంది గాయపడ్డారని సమాచారం. కానీ వాస్తవంగా ఈ లెక్క కొన్నిరెట్లు ఉంటుందని మీడియా వర్గాల సమాచారం. లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు దేశం వదిలి వలస వెళ్తున్నారు. ఉక్రేయి పరిస్థితి దారుణంగా ఉంది. తినడానికి ఫుడ్ లేదు. స్వచ్ఛమైన నీరు లేదు. మెడికల్ సహాయం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కోసం ఆస్కార్ నిలబడింది. `స్టాండ్ విత్ ఉక్రెయిన్` అనే స్లోగన్‌కి పిలుపినిచ్చింది. చనిపోయిన వారికి నివాళ్లు అర్పిస్తూ మౌనం పాటించింది.
94వ ఆస్కార్ వేడుక (94 Oscar wards event) ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో జరుగుతుంది. ఇందులో మొదటగా ఆస్కార్ నిర్వహకులు ఉక్రేయిన్ కోసం ప్రే చేశారు. చనిపోయిన వారికోసం మౌనం పాటించారు. ఆ దేశ ప్రజానికానికి మద్దతుగా నిలవాలని ప్రపంచానికి పిలుపిచ్చింది. `మీరు చేయగలిగిన విధంగా ఉక్రెయిన్‌కి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. `StandWithUkraine` అంటూ సందేశాన్ని పంచుకుంది. ఉక్రెయిన్లు చాలా రకాలుగా అవసరాలు కలిగి ఉన్నారు. ఇది వారికి చాలా క్లిష్టసమయం. ఈ వివాద సమయంలో మనం మానవత్వాన్ని చాటుకోవాలని తెలిపింది.
ఉక్రెయిన్‌లో లక్షల మంది ప్రజలకు ఆహారం దొరకడం లేదు. వైద్య సంరక్షణ లేదు. స్వచ్ఛమైన నీరు, అత్యవసర సేవలు అసవరం. అక్కడ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. గ్లోబల్ కమ్యూనిటీ మరింత చేయగలదు. అండగా నిలవగలదు` అంటూ సాధ్యమైన సహాయాన్ని అందించాలని కోరుకుంది ఆస్కార్. ఈ సందేశం అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఉక్రెయిన్‌కి మద్దతుగా చాలా మంది తారలు నీలిరంగు రిబ్బన్ను, బటన్లు ధరించి కనిపించడం విశేషం. రిబ్బన్లపై శరణార్థులతో` అని రాసి ఉండటం విశేషం.