శివగామి రమ్యకృష్ణ కారులో భారీగా పట్టుబడ్డ మద్యం, ఉలిక్కిపడ్డ చిత్ర పరిశ్రమ

Siva Kodati |  
Published : Jun 13, 2020, 03:53 PM IST
శివగామి రమ్యకృష్ణ కారులో భారీగా పట్టుబడ్డ మద్యం, ఉలిక్కిపడ్డ చిత్ర పరిశ్రమ

సారాంశం

రమ్యకృష్ణ  కారులో భారీగా మద్యం పట్టుబడిందన్న వార్తలతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. శనివారం చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన రమ్యకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా కారు (టీఎన్07క్యూ0099)ను నిలిపివేసిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు

అందం, అభినయంతో దశాబ్ధాలుగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు రమ్యకృష్ణ. అమాయకురాలైన ఆడపిల్లగా కంటతడి పెట్టించడంతో పాటు పొగురుబోతు పిల్లగానూ రమ్య మెప్పించారు.

చెన్నైలో స్థిరపడిన ఆమె పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తున్నారు. ఈ క్రమంలో రమ్యకృష్ణ  కారులో భారీగా మద్యం పట్టుబడిందన్న వార్తలతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది.

శనివారం చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన రమ్యకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా కారు (టీఎన్07క్యూ0099)ను నిలిపివేసిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సోదాల్లో భారీగా మద్యం వెలుగు చూసింది. సుమారు 96 బీర్ బాటిల్స్, 8 లిక్కర్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రమ్య కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. అయితే కొద్దిసేపటికే రమ్యకృష్ణ స్వయంగా వచ్చి సెల్వకుమార్‌ను బెయిల్‌పై తీసుకుని వెళ్లినట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Pregnant Before Marriage: పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యా, అదే కలిసివచ్చింది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Divorce: ఇద్దరు భార్యలకు విడాకులు.. ఏళ్ల తర్వాత అసలు కారణం చెప్పిన స్టార్ హీరో