
కొన్ని సినిమాలు స్టార్టు నటించాల్సిన అవసర లేదు.. అలా వచ్చి.. ఇలా ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి. కొన్ని సినిమాలు అయితే ట్రెండ్ ను క్రియేట్ చేస్తాయి. అటువంటి సినిమాల్లో 7/G బృందావన కాలనీ కూడా ఒకటి. ఈమూవీకి సీక్వెల్ అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈమూవీ సీక్వెల్ షూటింగ్ పై ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
కొన్నిసినిమాల్లో స్టార్స్ నటించాల్సిన అవసరం లేదు.. భారీ బడ్జెట్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కొత్త నటీనటులా.. పాతవారా అనేది కూడా చూసుకోవల్సిన అవసరం లేదు. అలా సైలెంట్ గా వచ్చి.. ఇలా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంటాయి. అంతే కాదు ట్రెండ్ సెట్టర్స్ గా నిలుస్తాయి. అటువంటిసినిమాల్లో 7/G బృందావన కాలనీ కూడా ఒకటి. సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో రొమాంటిక్ డ్రామా కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా పరిచయం అవ్వగా.. సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.
ఈ ఆల్‌టైమ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టు నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది మాత్రం గతంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈక్రమంలో ఇప్పుడు ఈ క్రేజీ సినిమా సీక్వెల్ న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈసినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో అన్న దానిపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి షురూ కానున్నట్లు సమాచారం. సీక్వెల్‌కు కుడా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించబోతుండగా.. లవ్ టుడే ఫేం ఇవానా , అదితి శంకర్ పేర్లు ఫీ మేల్ లీడ్ రోల్ కోసం పరిశీలనలో ఉన్నట్టు ఇన్‌సైడ్ టాక్.అయితే ఈసీక్వెల్‌లో మరోసారి రవికృష్ణ హీరోగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. సెల్వరాఘవన్ ఈమూవీని ఇంకా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఏఎం రత్నం టీం త్వరలోనే సీక్వెల్ ప్రాజెక్ట్‌లో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎంత వరకూ జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈమూవీకి 7/G రెయిన్‌బో కాలనీ టైటిల్ ను పరిశీలిస్తున్నారట. తాజాగా త్వరలోనే మరిన్ని వివరాలపై క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి కూడా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
2004లో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యి.. రెండు భాషల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది సినిమా. రవి కృష్ణ సోనియా అగర్వాల్ కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. ఇక ఈమూవీ తమిళంలో 7/G రెయిన్‌బో కాలనీ టైటిల్‌తో విడుదలై అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమా సెప్టెంబర్ 22న రీ రీలిజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి రీ రిలీజ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.