సెట్స్ పైకి వెళ్లబోతున్న 7/G బృందావన కాలనీ మూవీ సీక్వెల్ , ఎప్పటి నుంచీ అంటే..?

Published : Apr 21, 2023, 05:49 PM ISTUpdated : Apr 21, 2023, 05:52 PM IST
సెట్స్ పైకి వెళ్లబోతున్న 7/G బృందావన కాలనీ మూవీ సీక్వెల్ , ఎప్పటి నుంచీ అంటే..?

సారాంశం

ఇండస్ట్రీ నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా..కొన్ని సినిమాలు మాత్రమే ట్రెండ్ సెట్టర్స్ అవుతాయి. అటువంటి సినిమాల్లో 7/G బృందావన కాలనీ  కూడా ఒకటి. ఈమూవీకి సీక్వెల్ అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈమూవీపై ఓ అప్ డేట్ గట్టిగా వినిపిస్తోంది. 

ఇండస్ట్రీ నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా..కొన్ని సినిమాలు మాత్రమే ట్రెండ్ సెట్టర్స్ అవుతాయి. అటువంటి సినిమాల్లో 7/G బృందావన కాలనీ  కూడా ఒకటి. ఈమూవీకి సీక్వెల్ అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈమూవీపై ఓ అప్ డేట్ గట్టిగా వినిపిస్తోంది. 

కొన్నిసినిమాల్లో స్టార్స్ నటించాల్సిన అవసరం లేదు.. భారీ బడ్జెట్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కొత్త నటీనటులా.. పాతవారా అనేది కూడా చూసుకోవల్సిన అవసరం లేదు. అలా సైలెంట్ గా వచ్చి.. ఇలా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంటాయి. అంతే కాదు ట్రెండ్ సెట్టర్స్ గా నిలుస్తాయి. అటువంటిసినిమాల్లో 7/G బృందావన కాలనీ కూడా ఒకటి.    సెల్వ రాఘవన్‌  డైరెక్షన్‌లో రొమాంటిక్‌ డ్రామా కథతో  తెరకెక్కిన ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా పరిచయం అవ్వగా.. సోనియా అగర్వాల్‌ హీరోయిన్ గా నటించి మెప్పించింది. 

సీనియర్ నటుడు చంద్రమోహన్‌, విజయన్‌, సుమన్‌ శెట్టి, సుధ, మనోరమ లాంటి స్టార్ కాస్ట్ నటించిన  ఈసినిమా 2004లో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈసినిమా .. అటు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.ఇప్పటికీ యూత్ ఈసినిమాలో పాటల ఇష్టపడుతారు.. డైలాగ్స్ ను రీల్స్ గా చేస్తారు.. ఈమూవీ ఒక రకంగా చెప్పాలంటే.. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 

ఇక హీరో హీరోయిన్లుగా నటించిన రవి కృష్ణ, సోనియా అగర్వాల్‌ కెరీర్‌లో బెస్ట్ మూవీగా... ల్యాండ్ మార్క్‌ సినిమాగా నిలిచిపోయింది. ఈ ఆల్‌టైమ్‌ సూపర్ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టు నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది మాత్రం చెప్పలేదు. ఈక్రమంలో ఇప్పుడు ఈ క్రేజీ సినిమా సీక్వెల్‌ న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. 

తాజా సమాచారం  ప్రకారం  ఈసినిమా సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ జులైలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తంది. అయితే ఈసీక్వెల్‌లో మరోసారి రవికృష్ణ  హీరోగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ గా  సెల్వరాఘవన్‌ ఈమూవీని ఇంకా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడని తెలుస్తోంది.  ఏఎం రత్నం టీం త్వరలోనే సీక్వెల్ ప్రాజెక్ట్‌లో నటించే హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సూపర్ హిట్‌ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ఎంత వరకూ జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈమూవీకి 7/G రెయిన్‌బో కాలనీ టైటిల్‌ ను పరిశీలిస్తున్నారట. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..