National Film Awards: ధురంధర్ డైరెక్టర్ భార్యకు ఉత్తమ నటి అవార్డు..నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ కంప్లీట్ లిస్ట్

Published : Jul 18, 2026, 09:15 PM IST
Yami Gautam

సారాంశం

72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 'ఆర్టికల్ 370' ఉత్తమ చిత్రంగా నిలవగా, తెలుగు నుంచి 'కమిటీ కుర్రోళ్లు', 'పుష్ప: ది రూల్', 'కల్కి 2898 ఏడీ', '35 చిన్న కథ కాదు' చిత్రాలు పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నాయి.

72వ జాతీయ చలనచిత్ర అవార్డులు

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను ఈ అవార్డులతో సత్కరించారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల చిత్రాలు ఈసారి అవార్డులు అందుకున్నాయి.

ఈసారి 'ఆర్టికల్ 370' ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి ఉత్తమ నటులుగా, యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. తెలుగు నుంచి 'కమిటీ కుర్రోళ్లు' ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవగా, 'పుష్ప: ది రూల్', 'కల్కి 2898 ఏడీ', '35 చిన్న కథ కాదు' చిత్రాలు కూడా పలు విభాగాల్లో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాయి.

ఫీచర్ ఫిల్మ్ అవార్డులు

ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370 (జియో స్టూడియోస్)

ఉత్తమ దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్)

ఉత్తమ నటుడు: కార్తీక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్), మమ్ముట్టి (భ్రమయుగం)

ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ 370)

ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా (భక్షక్)

ఉత్తమ సహాయ నటి: రూపశ్రీ వర్కాడి (మిథ్యా), సచనా నమిదాస్ (మహారాజా)

ఉత్తమ బాల నటులు: రిద్ధిమాన్ బెనర్జీ, తపోమయ్ దేవ్, గీతాశ్రీ చక్రవర్తి (ఒంకో కి కోఠిన్), అరుందేవ్ పోతుల (35 చిన్న కథ కాదు), అతిష్ శెట్టి (మిథ్యా)

ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు (ఎస్. ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్)

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కల్కి 2898 ఏడీ (వైజయంతి మూవీస్)

ఉత్తమ తొలి దర్శకుడి చిత్రం: స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (రణదీప్ హుడా)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: సుకుమార్ (పుష్ప: ది రూల్)

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: యోగేష్ దేశ్‌పాండే (స్వర్గంధర్వ సుధీర్ ఫడ్కే)

ఉత్తమ సంభాషణలు: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహ్నాద్ జలాల్ (బ్రమయుగం)

ఉత్తమ ఎడిటింగ్: ఆర్. కళైవాణన్ (అమరన్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప: ది రూల్)

ఉత్తమ మేకప్: పి. రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ కొరియోగ్రఫీ: 'ఆజ్ కీ రాత్' – విజయ్ గంగూలీ (స్త్రీ 2)

ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): శశ్వత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)

ఉత్తమ నేపథ్య సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ (అమరన్)

ఉత్తమ గీత రచయిత: మనోజ్ ముంతషిర్ (మైదాన్)

ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు: అభయ్ జోధ్‌పుర్కర్ (ఘరత్ గణపతి)

ఉత్తమ మహిళా నేపథ్య గాయని: వైക്കം విజయలక్ష్మి (ఏఆర్‌ఎమ్)

ఉత్తమ సౌండ్ డిజైన్: మనస్ చౌదరి (భూల్ భులయ్యా 3)

ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: అనల్ అరసు (మహారాజా)

జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ప్రోత్సహించిన ఉత్తమ చిత్రం: కెప్టెన్ మిల్లర్

స్పెషల్ మెన్షన్: మేయ్యళగన్ (సురేన్ జి – సౌండ్ మిక్స్ ఇంజినీర్)

స్పెషల్ మెన్షన్: కెప్టెన్ మిల్లర్ (ధనుష్)

భాషల వారీగా ఉత్తమ చిత్రాలు

అస్సామీ – జుయిఫూల్

బెంగాలీ – చాల్‌చిత్ర ఏఖోన్

గుజరాతీ – మారన్

హిందీ – శ్రీకాంత్

కన్నడ – మిథ్యా

మలయాళం – ఫెమినిచి ఫాతిమా

మరాఠీ – ముక్కం పోస్ట్ బొంబిల్వాడి

ఒడియా – లహరి

తమిళం – రాయన్

తెలుగు – కమిటీ కుర్రోళ్లు

నాన్-ఫీచర్ ఫిల్మ్ అవార్డులు

ఉత్తమ డాక్యుమెంటరీ: రామ్ నామీ

ఉత్తమ దర్శకుడు: ఆనంద్ రాయ్ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: లైవ్ ఇన్ లూమ్

ఉత్తమ స్క్రిప్ట్: ఒబుర్

స్పెషల్ మెన్షన్: ది చోళా డోర్

స్పెషల్ మెన్షన్: సూయి

స్పెషల్ మెన్షన్: భద్రకాళి నాటకం


సినిమా రచన విభాగం 

ఉత్తమ సినీ విమర్శకుడు: సంజీవ్ శ్రీవాస్తవ 

సినిమాపై ఉత్తమ పుస్తకం: ప్రదీప్ కుమార్ శెట్టి (కన్నడ)

PREV
Read more Articles on
click me!

Recommended Stories

National Film Awards: దుమ్ములేపిన టాలీవుడ్..కల్కి, పుష్ప 2తో పాటు చిన్న సినిమాలకు జాతీయ అవార్డుల పంట
OTT Thriller: కోడలి అక్రమ సంబంధం గుట్టురట్టు, ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు