69వ నేషనల్‌ అవార్డుల ప్రకటన.. ఉత్తమ జాతీయ నటుడు అల్లు అర్జున్‌ (Live Updates)

Published : Aug 24, 2023, 05:24 PM ISTUpdated : Aug 24, 2023, 06:19 PM IST
69వ నేషనల్‌ అవార్డుల ప్రకటన.. ఉత్తమ జాతీయ నటుడు అల్లు అర్జున్‌  (Live Updates)

సారాంశం

69వ నేషనల్‌ అవార్డుల ప్రకటన వచ్చింది. ఈ సారి తెలుగు నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఉత్తమ నటులు విభాగంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ పోటీపడుతున్నారు. వీరిలో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.    

69వ నేషనల్‌ అవార్డుల ప్రకటన వచ్చింది. ఆగస్ట్ 24న కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ. 2021-2022లో వచ్చిన సినిమాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళతోపాటు ఇతర భారతీయ భాషల్లోని సినిమాలు అవార్డుల కోసం పోటీపడుతున్నాయి. ఈ సారి తెలుగు నుంచి ఉత్తమ నటుల కోసం టాప్‌ స్టార్స్ పోటీపడుతుండటం విశేషం. అందులో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానంగా ఉన్నారు. వీరితోపాటు సూర్య, ధనుష్‌, మలయాళ నటుడు టివినో థామస్‌, రణ్‌ వీర్‌ సింగ్‌, అలాగే ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌, అలియాభట్‌ వంటి వారు పోటీపడుతున్నారు. 

సినిమాల పరంగా `జైభీమ్`, `మిన్నల్‌ మురళి`, `తలైవి`, `సర్దార్‌ ఉద్దం`, `83`, `పుష్ప`, `షేర్షా`, `ది గ్రేట్‌ ఇండియన్ కిచెన్‌`, `గంగూభాయి కథియవాడి`, `నాయట్టు` వంటి సినిమాలు వివిధ అవార్డుల కోసం పోటీపడుతున్నాయి. 

నేషనల్‌ అవార్డుల ప్రకటన ప్రారంభమైంది. మొదటగా క్రిటిక్స్, బుక్స్, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ చిత్రాలకు అవార్డులను ప్రకటిస్తున్నారు. ఇందులో బెస్ట్ క్రిటిక్‌ అవార్డు తెలుగుకి చెందిన పురుషోత్తమ్‌ చార్యులుకి దక్కింది. 

69వ జాతీయ అవార్డుల జాబితా..

ఉత్తమ చిత్రంః రాకెట్రీ(తమిళం)

ఉత్తమ దర్శకుడుః నిఖిల్‌ మహరాజ్‌(గోదావరి-మరాఠి)

ఉత్తమ నటుడుః అల్లు అర్జున్‌( పుష్ప)-తెలుగు

ఉత్తమ నటిః అలియాభట్‌(గంగూబాయి కథియవాడి)-కృతి సనన్‌(మిమి)-హిందీ

ఉత్తమ సహాయ నటిః పల్లవి జోషి(ది కాశ్మీర్‌ ఫైల్స్- హిందీ)

ఉత్తమ సహాయ నటుడుః పంకజ్‌ త్రిపాఠి(మిమి-హిందీ)

ఉత్తమ డాన్సు మాస్టర్‌ః ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌(ఆర్‌ఆర్‌ఆర్‌-తెలుగు)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీః కింగ్‌ సోలోమన్‌(ఆర్‌ఆర్‌ఆర్‌- తెలుగు)

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ః వి శ్రీనివాస్‌ మోహన్‌(ఆర్‌ఆర్‌ఆర్-తెలుగు)

ఉత్తమ పాటః చంద్రబోస్‌(ధమ్‌ధమ్‌ధమ్‌- కొండపొలం-తెలుగు)

ఉత్తమ సంగీతంః దేవిశ్రీ ప్రసాద్‌(సాంగ్‌-పుష్ప) బీజీఎం- కీరవాణి(ఆర్‌ఆర్‌ఆర్‌-తెలుగు)

ఉత్తమ గాయకుడుః కాళభైరవ(ఆర్‌ఆర్‌ఆర్‌-కొమురం భీముడో)-తెలుగు

ఉత్తమ బాలల చిత్రంః `గాంధీ అండ్‌ కో`(గుజరాతీ)

ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రంః ఆవసవ్యుహాం(మలయాళం)

స్పెషల్‌ జ్యూరీ అవార్డుః `షేర్షా(విష్ణు వర్థన్‌-హిందీ)

ఉత్తమ తెలుగు చిత్రంః `ఉప్పెన`(బుచ్చిబాబు)


 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు