
చిరంజీవి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగులో ఆయన్ని మించిన స్టార్ లేడంటే అది అతిశయోక్తికాదు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా తన సుధీర్ఘ కెరీర్‌ని కొనసాగిస్తూ వస్తున్నారు. తిరుగులేని స్టార్‌గా రాణిస్తున్నారు. అయితే చిరంజీవి, చిరంజీవిగా మారి 43ఏళ్లు పూర్తయ్యాయి. కొణిదెల శివశంకర వరప్రసాద్ ఆయన అసలు పేరు అన్న విషయం తెలిసిందే.
తాను నటించిన తొలి సినిమా `పునాది రాళ్లు` సినిమా సమయంలో స్క్రీన్ నేమ్ ఏదైనా కొత్తగా, ఆకట్టుకునేలా ఉండాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. అలా 1978 ఫిబ్రవరి 11న `పునాది రాళ్లు` సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లాలోని దోసకాయలపల్లిలో ప్రారంభమైంది. అదే రోజున కొణిదెల శివ శంకర వర ప్రసాద్ కాస్త చిరంజీవిగా మారారు. అయితే చిరంజీవి ప్రారంభించిన తొలి సినిమా `పునాది రాళ్లు` అయినప్పటికీ మొదటి విడుదలైన చిత్రం మాత్రం `ప్రాణం ఖరీదు`. ఆ తర్వాత ఆయన సుప్రీం హీరోగా, అనంతరం మెగాస్టార్‌గా ఎదిగారు. చిరంజీవిగా చిరంజీవి మారిన సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ నాలుగున్నర దశాబ్దంలో 152 సినిమాల్లో నటించారు చిరంజీవి. తొలుత నెగటివ్ రోల్స్ చేసి మెప్పించారు. `ఖైదీ` సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకు స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. తిరుగులేని స్టార్‌గా రాణించారు. తెలుగు సినిమాకి కమర్షియల్ హంగులు అద్దారు చిరు. సరికొత్త డాన్స్ స్టెప్పులను పరిచయం చేశారు. అనేక అద్భుతమైన చిత్రాల్లో భాగమయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పర్చుకున్నారు. ఇప్పటికీ మెగాస్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌తో రన్ అవుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.