Gaddar Film Awards: ప్రభాస్ కల్కికి ధీటుగా సత్తా చాటిన చిన్న సినిమా, ఎన్ని అవార్డులు కొల్లగొట్టిందంటే

Published : May 29, 2025, 12:30 PM IST
Gaddar Awards

సారాంశం

గద్దర్ అవార్డ్స్ లో కల్కి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రానికి ఒక చిన్న చిత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఆ చిత్రం మరేదో కాదు నివేదా థామస్ నటించిన '35 చిన్న కథ కాదు'.

తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే గద్దర్ అవార్డులను ప్రకటించింది. గద్దర్ అవార్డుల జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ ఈ అవార్డులని మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించారు. ఎఫ్ డీ సీ చైర్మన్ దిల్ రాజు కూడా ఈ అవార్డుల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్నారు. గద్దర్ అవార్డుల కోసం 1248 నామినేషన్లు వచ్చాయని, వాటిలో చాలా మంచి చిత్రాలు ఉన్నాయని జయసుధ అన్నారు. కానీ అందులో ఉత్తమమైన వాటిని మాత్రమే అవార్డుల కోసం ఎంపిక చేసినట్లు జయసుధ తెలిపారు. 

సత్తా చాటిన కల్కి   

గద్దర్ అవార్డ్స్ లో ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా నివేదా థామస్ నిలిచింది. 35 చిన్న కథ కాదు చిత్రంలో నటనకు గాను ఆమెకి అవార్డు దక్కింది. గద్దర్ అవార్డ్స్ లో ప్రభాస్ కల్కి చిత్రం ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.  ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగాల్లో కల్కి 2898 AD చిత్రానికి అవార్డులు దక్కాయి.

కల్కికి ధీటుగా చిన్న సినిమా   

గద్దర్ అవార్డ్స్ లో కల్కి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రానికి ఒక చిన్న చిత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఆ చిత్రం మరేదో కాదు నివేదా థామస్ నటించిన '35 చిన్న కథ కాదు'. బెస్ట్ చిల్డ్రన్ మూవీ, ఉత్తమ నటి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డు దక్కాయి. ఈ మూవీలో నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రలో నటించారు. వీరి కొడుకుగా నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు దక్కింది. నందకిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. 

చదువు విషయంలో పిల్లల ఆలోచన విధానాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలా మార్చాలి.. వారితో ఎలా నడుచుకోవాలి అనే మంచి కథాంశంతో ఆలోచన రేకెత్తించేలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. నివేదా థామస్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో హైలైట్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vishnu Vinyasam First Review: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే
Illu Illalu Pillalu Today Episode Feb 26: ప్రేమ నగలతో నర్మద, అడ్డంగా ఇరికించేసిన వల్లి, భాగ్యం