2.0 ఫైనల్ కలెక్షన్స్: నిర్మాత సేప్.. కానీ?

Published : Feb 07, 2019, 08:03 PM IST
2.0 ఫైనల్ కలెక్షన్స్: నిర్మాత సేప్.. కానీ?

సారాంశం

వరల్డ్ వైడ్ గా ఒక ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అవుతుందని ఎవరు అనుకోలేదు. అయితే సినిమా భారీగా రిలీజ్ అయినప్పటికీ రిలీజ్ లో తేడా కొట్టేసింది. సినిమా కలెక్షన్స్ ఎవరు ఊహించని విధంగా ఫస్ట్ వీక్ అనంతరం తగ్గుతూ వచ్చాయి. ఫైనల్ గా ఇటీవల వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ నెంబర్ క్లోజ్ అయ్యింది. 

అయితే సినిమా నిర్మాతకు పెద్దగా లాభాలను ఇవ్వలేదు గాని బయ్యర్స్ ని మాత్రం గట్టి దెబ్బె కొట్టినట్లు టాక్ వస్తోంది. ఫైనల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా 300 కోట్ల షేర్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ లో పలు ఏరియాల్లో బయ్యర్స్ కి నష్టాలు తీవ్రంగా వచ్చాయి. తెలుగులో కూడా అనుకున్నంతగా సినిమా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది. 

రజినీకాంత్ - శంకర్ కాంబోలో అక్షయ్ కుమార్ నటించినప్పటికీ సౌత్ జనాలను ఎక్కువగా ఆకట్టుకోలేదు గాని నార్త్ లో మాత్రం సినిమాను కొన్న కరణ్ జోహార్ కి మంచి లాభాలనే 2పాయింట్O అందించింది. మొత్తంగా 617 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఈ సినిమాకు వచ్చినట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.   

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు