'24 కిస్సెస్' ట్రైలర్..!

Published : Oct 25, 2018, 10:37 AM IST
'24 కిస్సెస్' ట్రైలర్..!

సారాంశం

అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తోన్న చిత్రం '24 కిస్సెస్'. అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్ చాలా రొమాంటిక్  గా ఉండడంతో సినిమా పై యూత్ దృష్టి పడింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తోన్న చిత్రం '24 కిస్సెస్'. అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్ చాలా రొమాంటిక్ 
గా ఉండడంతో సినిమా పై యూత్ దృష్టి పడింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ''అలతానై.. అలరించేది మగువ, తనువు తానై మురిపించేది మగువ, ఉలితానై మనిషినే మలిచేది మగువ, నింగినైనా.. నేలనైనా అమూల్యమైనది మగువ' అంటూ రావు రమేష్, హీరో అరుణ్ పాడే పాటతో ట్రైలర్ మొదలైంది.

ప్రేమ, పెళ్లి అనే విషయాలపై నమ్మకం లేని హీరోకి అమ్మాయిలంటే మాత్రం బాగా ఇష్టం. అలాంటి అబ్బాయిని సిన్సియర్ గా ప్రేమిస్తుంది హీరోయిన్. మరి చివరకి ఏం జరుగుతుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.

అయితే టీజర్ లో కనిపించినంత ఘాటు రొమాంటిక్ సన్నివేశాలు ట్రైలర్ లో లేకుండా.. కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసే విధంగా ట్రైలర్ ని కట్ చేశారు. ఈ సినిమాని నవంబర్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాన్సెప్ట్ కొత్తది కావడంతో సినిమాతో సక్సెస్ అందుకుంటామనే నమ్మకంతో ఉంది చిత్రబృందం. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌