2023 సంక్రాంతి రేస్... బాలయ్య తర్వాతే చిరు, వాల్తేరు వీరయ్య ఎప్పుడంటే?

By Sambi ReddyFirst Published Dec 7, 2022, 5:43 PM IST
Highlights


సంక్రాంతి సినిమా హీట్ మొదలైపోయింది. ఒక్కొక్కరిగా విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. బాలకృష్ణ ఆల్రెడీ వీరసింహారెడ్డి విడుదల డేట్ కన్ఫర్మ్ చేశారు. నేడు వాల్తేరు వీరయ్య విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది. 

సినిమా ప్రియులకు 2023 సంక్రాంతి చాలా ప్రత్యేకం. చిరంజీవి-బాలకృష్ణ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు. నరసింహనాయుడు-మృగరాజు,  గౌతమీపుత్ర శాతకర్ణి-ఖైదీ నెంబర్ 150, లక్ష్మీ నరసింహ-అంజి వంటి చారిత్రాత్మక సంక్రాంతి ఫేస్ ఆఫ్స్ వారి మధ్య ఉన్నాయి. ఈసారి వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డిగా సంక్రాంతి బరిలో దిగుతున్నారు. మధ్యలో హీరో విజయ్ సైతం వారసుడిగా వస్తున్నాడు. 

ఈ మూడు బడా చిత్రాలు పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వారసుడు విడుదల విషయంలో ఒకింత వివాదం నెలకొంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ చిత్రాన్ని డబ్బింగ్ చిత్రం అంటూ టాలీవుడ్ నిర్మాతల మండలి సంక్రాంతికి విడుదల చేయకూడని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తమిళ దర్శక నిర్మాతలు తప్పుబట్టారు. అయితే పరిశ్రమను శాసిస్తున్న దిల్ రాజును కట్టడి చేయడం అయ్యేపని కాదు. దిల్ రాజు తన పంతం నెక్కించుకుంటారనేది నిజం. వారసుడు సంక్రాంతికి విడుదల కావడం ఖాయం. 

కాగా సంక్రాంతి రేసులో ఎవరు ముందు? ఎవరు వెనుక? తేదీలు ఏంటనే? చర్చ నడుస్తుండగా... ఒక్కొక్కరు స్పష్టత ఇస్తున్నారు. జనవరి 12న వీరసింహారెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది. ఇక నేడు వాల్తేరు విడుదల తేదీ ప్రకటించారు. జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదల చేస్తున్నారు. బాలయ్య వీరసింహారెడ్డి విడుదలైన మరుసటి రోజు వాల్తేరు వీరయ్య విడుదల చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కావడంతో సయోధ్య నెలకొంది. 

సంక్రాంతి కి కలుద్దాం 🔥🎯 pic.twitter.com/dLBKLphlZk

— Chiranjeevi Konidela (@KChiruTweets)

ఇక జనవరి 11న లేదా 14న వారసుడు విడుదల కావచ్చు. లేదంటే 12,13 తేదీల్లో కూడా ఉండవచ్చు. మరి చూడాలి దిల్ రాజు ఎలా డిసైడ్ చేస్తాడో. మరోవైపు దిల్ రాజు సింహభాగం థియేటర్స్ వారసుడు చిత్రానికి కేటాయించాడట. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డికి చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్స్ లభించలేదనే ప్రచారం జరుగుతుంది. 

థియేటర్స్ ని గుప్పెట్లో పెట్టుకొని దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, ఏషియన్ సునీల్ పరిశ్రమను కంట్రోల్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. వారి కరుణాకటాక్షాల మీదే థియేటర్స్ లభ్యత ఆధారపడి ఉంటుంది. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య వంటి ఒక సీనియర్ టాప్ హీరో నా చిత్రానికి ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారని సురేష్ బాబు, అల్లు అరవింద్ లను అడిగారు. బాలయ్య కూడా రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి పరిశ్రమలో ఉంది. 

click me!