
2020 ఏడాదికి గాను 68వ జాతీయ సినిమా అవార్డ్స్ ను కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు. ఈ అవార్డ్ లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఫీచర్డ్, నాన్ ఫీచర్డ్ కేటగిరీల్లో అవార్డులను అనౌన్స్ చేశారు. కలర్ ఫొటో, నాట్యం చిత్రాలు బెస్ట్ ఫీచర్డ్ ఫిల్మ్స్ అవార్డులను దక్కించుకున్నాయి. అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గాను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ కూడా అవార్డును సొంతం చేసుకున్నారు.
షెడ్యూల్ 8వ కాన్స్టిట్యూషన్ బెస్ట్ తెలుగు ఫిలిం కేటగిరిలో తెలుగు చిత్రం 'కలర్ ఫోటో' (Colour Photo) మూవీకి జాతీయ అవార్డు దక్కింది. ఈ చిత్రంలో కమెడియన్, షార్ట్ ఫిల్మ్స్ యాక్టర్ సుహాస్, తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రాజ్ మూవీకి దర్శకత్వం వహించారు. బెస్ట్ లవ్ స్టోరీగా కలర్ ఫొటోను ప్రేక్షకులు ఆదరించారు. సినిమాలోని సాంగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరోహీరోయిన్లు సహజంగా నటించడం, కథ అద్భుతంగా ఉండటంతో అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.
అలాగే గతేడాది అక్టోబర్ లో రిలీజ్ అయిన ‘నాట్యం’ (Natyam) సినిమాకు కూడా బెస్ట్ ఫీచర్డ్ ఫిల్మ్ గా జాతీయ అవార్డు అవార్డు దక్కింది. ఈ సినిమా ద్వారా నాట్యం భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రసిద్ధి చెందిన గ్రామంగా.. అనేక సాంప్రదాయ నృత్య పాఠశాలలకు నిలయంగా చెప్పడం జూరీ మెంబర్స్ ను అంగీకరించేలా చేసింది. ఈ చిత్రంలో నటి సంధ్యా రాజు ప్రధాన పాత్రలో నటించింది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. నిష్రింకలా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత సంధా రాజునే చిత్రాన్ని రూపొందించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో 2020 జనవరిలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘అలా వైకుంఠపురంలో’ కూడా నాన్ ఫీచర్డ్ కేటగిరిలో మ్యూజిక్ కు జాతీయ సినిమా అవార్డును దక్కించుకుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) అవార్డును దక్కించుకున్నారు. ఈ చిత్రంలోని సాంగ్స్, బీజీఎం, ట్యూన్స్ అదిరిపోయాయి. ‘రాములో రాములా’, ‘సామజవరగమన’ సాంగ్స్ ఎంతలా హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలను సంగీత ప్రియులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.