2018లో డాలర్ల వర్షం కురిపించిన చిత్రాలు!

Published : Dec 26, 2018, 06:49 PM IST
2018లో డాలర్ల వర్షం కురిపించిన చిత్రాలు!

సారాంశం

రోజు రోజుకి తెలుగు సినిమాల మార్కెట్ పెరుగుతూ వస్తోంది. బాలీవుడ్ తో సమానంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకోవడంలో టాలీవుడ్ ఇప్పుడు పటిష్టంగా మారుతోంది. 

రోజు రోజుకి తెలుగు సినిమాల మార్కెట్ పెరుగుతూ వస్తోంది. బాలీవుడ్ తో సమానంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకోవడంలో టాలీవుడ్ ఇప్పుడు పటిష్టంగా మారుతోంది. ఇకపోతే అమెరికాలో మన సినిమాలకు ఏ స్థాయిలో ఆదరణ అందుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 2018లో టాలీవుడ్ నుంచి వచ్చిన 5 సినిమాలు యూఎస్ లో డాలర్ల వర్షం కురిపించాయి. 

రామ్ చరణ్ రంగస్థలం అలాగే మహేష్ భారత్ నేను కొత్త పాయింట్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇక మొట్ట మొదటి సారి యూఎస్ లో ఒక లేడి ఓరియెంటెడ్ బయోపిక్ మహానటి మంచి కలెక్షన్స్ అందుకుంది. సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో కీర్తి సురేష్ నటన ప్రవాసులకు బాగా నచ్చేసింది. 

ఇక గీత గోవిందం అంటూ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి కంటే మరిన్ని డాలర్లను రాబట్టాడు. అదే విధంగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ అరవింద సమేత కూడా స్పీడ్ గా మిలియన్ డాలర్లను వసులు చేసి టాప్ 5లో  ఒకటిగా నిలిచింది. 

2018లో యూఎస్ లో అత్యధిక డాలర్లను రాబట్టిన టాప్ 5 మూవీస్

రంగస్థలం - $ 3,513,450

భారత్ అనే నేను - $ 3,416,451

మహానటి - $ 2,543,515

గీతా గోవిందం- $ 2,465,367

అరవింద సమేత - $ 2,181,943

PREV
click me!

Recommended Stories

టాక్సిక్ లో బోల్డ్ సీన్, ఈ సినిమాకి ఆమె దర్శకురాలు అంటే నమ్మలేకపోతున్నా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..