`ఎఫ్‌3` సెట్‌లో కరోనా కలకలం.. 20 మందికి కరోనా.. షూటింగ్‌ నిలిపివేత?

Published : Jan 10, 2022, 05:29 PM IST
`ఎఫ్‌3` సెట్‌లో కరోనా కలకలం.. 20 మందికి కరోనా.. షూటింగ్‌ నిలిపివేత?

సారాంశం

రాజేంద్రప్రసాద్‌ ఆదివారం వైరస్‌ సోకినట్టు నిర్థారణ అయిన విషయం తెలిసిందే.  `ఎఫ్‌3` సినిమా షూటింగ్‌లోనే పాల్గొంటున్నాడట. షూటింగ్‌ చేసే క్రమంలో ఆయనకు వైరస్‌ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా,  కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

కరోనా మహమ్మారి మరోసారి వెంటాడుతుంది. ఈ సారి మరింత వేగంగా విజృంభిస్తోంది. వరుసగా అనేక మంది సెలబ్రిటీలు వైరస్‌ బారిన పడుతున్నారు. టాలీవుడ్‌ సెలబ్రిటీలు మహేష్‌బాబు, థమన్‌, రాజేంద్రప్రసాద్‌, బండ్ల గణేష్‌, మంచు మనోజ్‌, విశ్వక్‌ సేన్‌ ఇలా అనేక మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు షూటింగ్‌ సెట్‌లోనే కరోనా మహమ్మారి వెంటాడుతుందట. `ఎఫ్‌ 3` సినిమా సెట్‌లో కరోనా కలకలం సృష్టించిందని తెలుస్తుంది. 

రాజేంద్రప్రసాద్‌ ఆదివారం వైరస్‌ సోకినట్టు నిర్థారణ అయిన విషయం తెలిసిందే.  `ఎఫ్‌3` సినిమా షూటింగ్‌లోనే పాల్గొంటున్నాడట. షూటింగ్‌ చేసే క్రమంలో ఆయనకు వైరస్‌ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా,  కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే సెట్‌లోని అందరికి కరోనా టెస్ట్ లు చేయించగా అందులో 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని తెలుస్తుంది. దీంతో వెంటనే షూటింగ్‌ని నిలిపివేశారట. కొన్ని రోజుల పాటు చిత్రీకరణ ఆపేసినట్టు ఫిల్మ్ నగర్‌ టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో హీరో వెంకటేష్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు నిరాసక్తి చూపించారని, దీంతో ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. అయితే తమన్నా, మెహరీన్‌ కూడా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నట్టు టాక్. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పుడీ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `ఎఫ్‌2`కి సీక్వెల్‌గా `ఎఫ్‌3` రూపొందుతుంది. డబ్బుతో కూడిన ఫ్రస్టేషన్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. 

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరోహీరోయిన్లుగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో `ఎఫ్‌3` చిత్రం రూపొందుతుంది. ఇందులో మరో సర్‌ప్రైజింగ్‌ స్టార్స్ కూడా ఉంటారని టాక్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 29న విడుదల చేయబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి