రాజశేఖర్ సినిమా సెట్ కోసం రూ.2 కోట్లు!

Published : Sep 10, 2018, 01:17 PM ISTUpdated : Sep 19, 2018, 09:18 AM IST
రాజశేఖర్ సినిమా సెట్ కోసం రూ.2 కోట్లు!

సారాంశం

సీనియర్ హీరో రాజశేఖర్ నటుడిగా వరుస పరాజయాలు అందుకోవడంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని 'గరుడ వేగ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సీనియర్ హీరో రాజశేఖర్ నటుడిగా వరుస పరాజయాలు అందుకోవడంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని 'గరుడ వేగ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా    తరువాత దర్శకనిర్మాతలకు రాజశేఖర్ పై నమ్మకం పెరిగింది. ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాతలు ముంచుకొచ్చారు.

అయితే రాజశేఖర్ మాత్రం ఏరి కోరి 'అ!' సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు 'కల్కి' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. 1980ల కాలంలో జరిగే పీరియాడిక్ డ్రామాతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ నెల 19 నుండి హైదరాబాద్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు రూ.2 కోట్ల బడ్జెట్ తో భారీ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ పటాన్ చెరువు దగ్గరలో ఈ సెట్ ను నిర్మించనున్నారు. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ సెట్ లో తీయనున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రాజశేఖర్ కుమార్తెలతో కలిసి నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ