Kajal Eliminated: ఈ సీజన్‌ చివరి ఎలిమినేషన్‌ కాజల్‌.. టాప్‌ 5 వారేనా?

Published : Dec 11, 2021, 04:01 PM ISTUpdated : Dec 11, 2021, 04:13 PM IST
Kajal Eliminated: ఈ సీజన్‌ చివరి ఎలిమినేషన్‌ కాజల్‌.. టాప్‌ 5 వారేనా?

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 5 లో చివరివారం.. చివరి ఎలిమినేషన్ లో కాజల్.... ఇంటినుంచి బయటకు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.

బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న షో.. బిగ్ బాస్ సీజన్ 5.. రోజు రోజకు హిట్ పుట్టిస్తుంది. ఇప్పటికే 14 వారాలు కంప్లీట్ అవ్వగా.. ఇప్పుడు 14వ వారం ఎలిమేషన్ కూడా అయిపోయింది. 19 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. ప్రతీ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా.. అనుకుంటూ ఉత్కంఠతో ఎదురు చూస్తుండే  ఆడియన్స్ కు.. బిగ్ బాస్ త్వరలో  క్లైమాక్స్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.  

ఇక లాస్ట్ వీక్ ప్రియాంకా సింగ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లిపోగా.. ఈ వీక్ హౌస్ నుంచి కాజల్ బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం.అసలు కాజల్ ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేది. కాని జెస్సీ అనారోగ్యం కారణంగా హౌస్ ను వీడిపోవడంతో..ఆ వీక్ కాజల్ సేప్ అయ్యింది.

 

అప్పటి నుంచి తన స్ట్ర్రాటజీలు మార్చుకుని.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సన్నీతో స్నేహం చేసింది కాజల్.దాంతో ప్రతీవారం సేవ్ అవుతూ వస్తుంది. ఆతరువాత టాస్స్ లు బాగా ఆడి  టాప్5లోకి  వెళ్లిన శ్రీరామ్ తో కూడా గట్టిగానే ప్రెండ్  షిప్ చేసి ఓట్లుపెంచుకుంది కాజల్ .  కాని ఈ వారం హౌస్ లో జరిగిన పరిణామాలతో.. అందరి ద్రుష్టిలో కాజల్ విలన్ గా మారిపోయింది. చివరికి సన్నీ కూడా చిరాకుపడటం... అప్పటి వరకూ బాగా ఉన్న శ్రీరామ్ చంద్ర - కాజల్ మధ్య వాడి వేడి ఫైట్ జరగడంతో.. కాజల్ పై నెగిటివిటీ పెరిగిపోయింది.

Also Read : Krithi shetty : ధైర్యం చేసిన కృతి శెట్టి.. ప్రయోగం చేయబోతోంది.. మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది...

 

కొన్ని విషయాల్లో ఆడియన్స్ ను కూడా విసిగించింది కాజల్. దాంతో కాజల్ కు ఈసారి ఎలిమినేషన్ నుంచి తప్పించుకనే వీలు లేకుండా పోయింది.పైగా ఇప్పుడు హౌస్ లో ఉన్నవాళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. సన్నీ,మానస్,శ్రీరామ్, షణ్ముఖ్, సిరి టాప్ 5లో ఉన్నారు. వీరిలో విన్నర్ ఎవరు... రన్నర్ ఎవరు అవుతారో అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎవరికి వారు.. తమ ఫేవెరెట్ స్టార్ గెలవాలంటూ కోరకుంటున్నారు. వీరిలో ఎవరు బిగ్ బాస్ సీజన్5 టైటిల్ కొడతారో చూడాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు