చిరంజీవి చిన్నల్లుడి కేసులో 10 మంది అరెస్ట్!

Published : Jun 14, 2019, 02:21 PM IST
చిరంజీవి చిన్నల్లుడి కేసులో 10 మంది అరెస్ట్!

సారాంశం

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనను ఇన్స్టాగ్రామ్ లో కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కళ్యాణ్ దేవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తనను టార్గెట్ చేయడంతో పాటు తన ఫ్యామిలీని కూడా దూషిస్తున్నట్లు కళ్యాణ్ దేవ్ చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా ఆధారాలతో పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

వారి ఐడీలతో పాటు అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆ పది మందిపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఐదు రోజుల క్రితం కళ్యాణ్ దేవ్ నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణలో భాగంగా ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాశారు. వారి నుండి వివరాలు అందుకున్న వెంటనే నిందితులుగా గుర్తించిన పది మందిని అరెస్ట్ చేశారు.

సినిమాల విషయనికొస్తే.. 'విజేత' సినిమాతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 
 

చిరంజీవి చిన్నల్లుడిపై అసభ్యకర కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌