#TheRingsOfPower:ఓటిటి చరిత్రలో అతి పెద్ద రికార్డ్ ..అఫీషియల్ ప్రకటన

Published : Sep 04, 2022, 09:50 AM IST
 #TheRingsOfPower:ఓటిటి చరిత్రలో అతి పెద్ద రికార్డ్ ..అఫీషియల్ ప్రకటన

సారాంశం

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఓటీటీ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ ను చూస్తున్నట్లుగా అమెజాన్ పేర్కొంది. 15 ఏళ్ల తమ చరిత్రలో ఈ సీరిస్ కే ఎక్కువ వ్యూస్ వచ్చాయని అమేజాన్ అఫిషియల్ గా ప్రకటించింది. 25 మిలియన్స్ మంది చూసారని, వ్యూయర్ షిప్ వచ్చిందని తెలిపింది.


 ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన హాలీవుడ్‌ ఫాంటసీ సినిమా ‘ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’తెలియని సినీ ప్రేమికులు ఉండరు. ఈ సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌: ది రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌’. అడ్వెంచర్‌, డ్రామా, ఫాంటసీ కథాంశంతో రూపొందొంది. జేడీ పేన్‌, ప్యాట్రిక్‌ మెక్‌కే తెరకెక్కించారు. సింథియా రాబిన్సన్‌, రాబర్ట్‌ అరమయో, ఒవైన్‌ ఆర్థర్‌ కీలక పాత్రలు పోషించారు. 

ఈ ఎపిసోడ్‌ సెప్టెంబరు 2న ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలయ్యింది.  తెలుగు వెర్షన్ కు సైతం  ట్రైలర్‌ విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఈ వెబ్ సిరీస్ పలు ఇండియన్ భాషల్లో విడుదల చేయడంతో పాటు పలు భాషల్లో సబ్ టైటిల్స్ ను కూడా అందుబాటులో ఉంచారు. 

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఓటీటీ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ ను చూస్తున్నట్లుగా అమెజాన్ పేర్కొంది. 15 ఏళ్ల తమ చరిత్రలో ఈ సీరిస్ కే ఎక్కువ వ్యూస్ వచ్చాయని అమేజాన్ అఫిషియల్ గా ప్రకటించింది. 25 మిలియన్స్ మంది చూసారని, వ్యూయర్ షిప్ వచ్చిందని తెలిపింది.
 
ఇండియాలోనే కాకుండా ఈ వెబ్ సిరీస్ సందడి దాదాపుగా వంద దేశాల్లో ఉందంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ ను ప్రస్తుతానికి 32 భాషల్లో స్ట్రీమింగ్ చేసారు.  ఎపిసోడ్ లు విడుదల అయ్యే కొద్ది అంచనాలు భారీగా పెరుగుతాయి అంటున్నారు.

తొలి ఎపిసోడ్ కు గూగుల్ లో 10 కి గాను 7.5 రేటింగ్ రావటం కలిసొచ్చింది. ముందు ముందు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యి వాటి యొక్క ఆధరణ బాగుంటే తప్పకుండా ఈ రేంటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటి ఎపిసోడ్ కే ఈ స్థాయి రేటింగ్ అంటే కచ్చితంగా ది రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క సక్సెస్ గా చెప్పాలి.  

ఇందులోని గ్రాఫిక్స్‌ దృశ్యాలు, పోరాట సన్నివేశాలు.. ప్రేక్షకుల్ని శతాబ్దాల కాలం నాటి రాచరిక యుగానికి తీసుకెళ్తున్నట్టుగా ఆకట్టుకునే విధంగా ఉండటం కలిసొచ్చింది. జేఆర్‌ఆర్‌ టోకిన్స్‌ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాల్ని నిర్మించారు.
 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, టాలీవుడ్ మొత్తం షేక్
Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు హీరోయిన్‌ ఇంట్రెస్ట్