
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న భారీఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి ‘సైకో సైయ్యా’ అలానే ఓ రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేశారు. తాజాగా మరో స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటలో ప్రభాస్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిపి స్టెప్పులేశాడు. ఈ పాటలో జాక్వెలిన్ చాలా హాట్‌గా ఉంది. తన స్టెప్పులతో అదరగొట్టింది.
ఇక ఈ పాటలో ప్రభాస్ చుట్టూ అమ్మాయిలూ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని స్టెప్పులేస్తున్నారు. ప్రభాస్ కూడా అంతే స్టైలిష్‌గా ఉన్నారు. ఈ పాటను ఆస్ట్రియాలో చిత్రీకరించారు. ఈ పాట విడుదలైన రెండు రోజులకే మిలియన్ల వ్యూస్ ని సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి ఈ పాట ఇరవై మిలియన్ల వ్యూస్ ని రాబట్టినట్లు చిత్రబృందం వెల్లడించింది.