రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి పాలాభిషేకం

Published : Jun 06, 2018, 10:36 AM IST
రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి పాలాభిషేకం

సారాంశం

అక్కినేని ఫ్యామిలీని వదిలేయండి అని కోరుతూ..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి అక్కినేని అభిమానులు పాలాభిషేకం చేశారు. అదేదో అభిమానం ఎక్కువై అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఇకనైనా అక్కినేని ఫ్యామిలీని వదిలేయండి అని కోరుతూ వీళ్లు ఆ అభిషేకం చేశారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రామ్ గోపాల్ వర్మ  ఇటీవల నాగార్జున హీరోగా ఆఫీసర్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నాగార్జున కెరీర్ లోనే అత్యంత తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

కాగా.. తన తదుపరి చిత్రం అఖిల్ తో చేయాలనుకుంటున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. నాగ్ కూడా వర్మ, అఖిల్‌ మధ్య చర్చలు జరుగుతున్న విషయాన్ని ధృవీకరించారు. దీంతో అక్కినేని అభిమానుల్లో కలవరం మొదలైంది. ఈ విషయంపై అక్కినేని అభిమానులు వినూత్నంగా స్పందించారు. 

అక్కినేని ఫ్యామిలీని వదిలేయాలని కోరుతూ వర్మ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆర్జీవీ.. దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. 
 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి