'మిఠాయి' రిలీజ్ డేట్ ఖరారు!

Published : Jan 22, 2019, 03:46 PM ISTUpdated : Jan 22, 2019, 03:47 PM IST
'మిఠాయి' రిలీజ్ డేట్ ఖరారు!

సారాంశం

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి 'సాయి' భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలు ఎక్కువ కంటున్నాడని కంపెనీ అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే... ఓ సమస్య ఎదురవుతుంది. 

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి 'సాయి' భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలు ఎక్కువ కంటున్నాడని కంపెనీ అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే... ఓ సమస్య ఎదురవుతుంది. మూడు రోజుల్లో ఓ దొంగ‌ను ప‌ట్టుకుంటేనే పెళ్లి జ‌రుగుతుంది.

ప‌ట్టుకోలేదంటే పెళ్లి జ‌ర‌గ‌దు. అటువంటి సంద‌ర్భంలో త‌న స్నేహితుడు జానీతో క‌లిసి దొంగ‌ను పట్టుకోవ‌డానికి సాయి బ‌య‌లుదేర‌తాడు. ఈ ప్ర‌యాణంలో అత‌డికి ఎదురైన స‌మ‌స్య‌లేంటి? సాయి దొంగ‌ను ప‌ట్టుకున్నాడా? లేదా? అస‌లు, ఆ దొంగ ఎవ‌రు? సాయి పెళ్లి జ‌రిగిందా? లేదా? ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల‌వుతున్న మా చిత్రం చూసి తెలుసుకోమంటున్నారు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ కుమార్‌.

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన డార్క్ కామెడీ చిత్రం 'మిఠాయి'. డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22 న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం టీజర్ విడుదల చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద