విడాకులు తీసుకుంటున్న మరో హీరో!

Published : May 11, 2019, 04:17 PM IST
విడాకులు తీసుకుంటున్న మరో హీరో!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామనే.. అయితే కొందరు ప్రేమించిన వారితో జీవించలేక విడాకులు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. 

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామనే.. అయితే కొందరు ప్రేమించిన వారితో జీవించలేక విడాకులు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టు లో చేరబోతున్నాడు నటుడు అరుణోదయ్ సింగ్. 'జిస్మ్ 2' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో తన భార్య లీ ఎల్టన్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

కొంతకాలంపాటు ఒకరినొకరు ప్రేమించుకున్న తరువాత 2016 వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భోపాల్ లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని అరుణోదయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ప్రేమించినప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని, కానీ ఆ సంతోషాన్ని వివాహం తరువాత లేదని.. పెళ్లి బంధాన్ని నిలుపుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశామని చెప్పుకొచ్చారు. కౌన్సిలింగ్ తీసుకొని, కొన్ని రోజులు పాటు వేరు వేరుగా ఉన్నా అవేవీ మా బంధాన్ని పునరుద్ధరించలేకపోయాయని చెప్పాడు. 

దీంతో విడిపోవడమే ఇద్దరికీ మంచిదని భావించి.. నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సినిమాల విషయానికొస్తే.. 'జిస్మ్ 2' సినిమా తరువాత ఈ నటుడు ఐసా, యే సాలీ జిందగీ, మై తెరా హీరో, బుద్దా ఇన్ ఏ ట్రాఫిక్, మహెంజదారో, బ్లాక్ మెయిల్ వంటి చిత్రాల్లో నటించారు. 

 

PREV
click me!

Recommended Stories

Mega Twins: ఇక అధికారికమే, మెగా వారసులు వచ్చే డేట్‌ ఇదే.. చిరంజీవి ఫ్యామిలీకి త్రిబుల్‌‌ ట్రీట్‌
Bhumika: `ఖుషి` సినిమాకి మేకప్‌ వేసుకోనివ్వలేదు.. పవన్‌ కళ్యాణ్‌ పై భూమిక క్రేజీ కామెంట్‌