సంక్రాంతి వెళ్లి 15 రోజులు అవుతున్నా హనుమాన్ కలెక్షన్ల సునామీ ఆగడం లేదు.
అనుకున్నట్టుగానే హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాని చూసేసారు. మిగతావాళ్లు ఓటీటీిలో చూద్దామని ఎదురు చూస్తున్నారు. అయితే అంత పెద్ద హిట్ అయిన సినిమా అంత త్వరగా ఓటిటిలోకి వస్తుందా. థియేటర్లో నడుస్తుండగానే ఓటీటిలో కి వచ్చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ గోల ఎత్తిపోతారు. ఆ విషయం హనుమాన్ టీం గమనించింది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. హనుమాన్ ఓటిటి రైట్స్ తీసుకున్న జీ5 వారిని రిక్వెస్ట్ చేసింది అని తెలుస్తోంది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ జీ 5 వాళ్లు రిలీజ్ కు ముందు డిజిటల్ రైట్స్ ని చాలా తక్కువ రేటుకే తీసుకున్నారు. రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత స్ట్రీమ్ చేసేందుకు ఎగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు సినిమా భారీ సక్సెస్ అవ్వటంతో నక్క తోక తొక్కినట్లు అయ్యింది. ఈ క్రమంలో థియేటర్ రన్ పూర్తయ్యే దాకా సినిమా ఓటిటిని ఆపుతానని మాట ఇచ్చి ఎనిమిది వారాల తర్వాత ఓటిటిలో స్ట్రీమ్ చేసేందుకు ఓకే చేసిందని సమాచారం. మార్చి మొదటి వారంలో ఈ సినిమా ఓటిటిలో అన్ని భాషల్లో రానుంది. అయితే ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావాల్సి ఉంది.
ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సంక్రాంతి బరిలోని పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన భారీ సినిమా, దానికి సంబంధించిన విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. తొలుత హనుమాన్‌కు తక్కువ థియేటర్లు ఇచ్చిన తర్వాత సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో థియేటర్ల సంఖ్యను పెంచాల్సి వచ్చింది. సంక్రాంతి వెళ్లి 15 రోజులు అవుతున్నా హనుమాన్ కలెక్షన్ల సునామీ ఆగడం లేదు.
తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని, పిల్లలను , విపరీతంగా ఆకట్టుకుంటోంది. హనుమాన్ సినిమా భారతీయ భాషలైన తెలుగు, హిందీ, మరాఠీ,తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లోనూ రిలీజ్ అవటం విశేషం. ఈ మూవీని నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. హరి గౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు.