ఆ హీరో మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న మెగాస్టార్!

Published : Jan 20, 2020, 04:49 PM IST
ఆ హీరో మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న మెగాస్టార్!

సారాంశం

తాజాగా జరిగిన జీ అవార్డుల కార్యక్రమంలో కార్తికేయ స్టేజ్ మీద చిరు పాటలకు స్టెప్పులేశాడు. ఆ తరువాత అతడి మాటలు విన్న చిరు ఎమోషనల్ అయిపోయారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. 


మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి అంత ఎమోషనల్ కావడానికి కారణం యంగ్ హీరో కార్తికేయ. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు.

ఆ తరువాత రెండు సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినప్పటికీ ఈ హీరోకి సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ హీరో గీతా ఆర్ట్స్ లోనే ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా.. తాజాగా జరిగిన జీ అవార్డుల కార్యక్రమంలో కార్తికేయ స్టేజ్ మీద చిరు పాటలకు స్టెప్పులేశాడు.

వైరల్ ఫొటోలు : చీరకట్టులో జాన్వీ సెక్సీ లుక్, చూసే కళ్లదే లక్

ఆ తరువాత అతడి మాటలు విన్న చిరు ఎమోషనల్ అయిపోయారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. చిరంజీవి గారిని చూస్తూ పెరిగానని.. తాను సినిమాల్లోకి రావాడానికి ఆయనే ఆదర్శమని చెప్పిన కార్తికేయ ఆయనకి ట్రిబ్యూట్ గా దాదాపు పది పాటలకు డాన్స్ చేశాడు.

ఆ పెర్ఫార్మన్స్ అనంతరం కార్తికేయ.. తన 27 ఏళ్ల జీవితమలో అత్యుత్తమ క్షణాలు ఇవేనని అన్నాడు. చిరంజీవిని ఉద్దేశిస్తూ చరణ్ మాత్రమే కాదని.. తామందరం కూడా చిరంజీవి పిల్లలమేనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసిన చిరు సైతం ఎమోషనల్ అవుతూ తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయారు. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?