మృత్యువు అంచు వరకు హీరోయిన్.. కారుపై బుల్లెట్ల వర్షం.. దేవుడే బతికించాడు!

Published : Mar 10, 2020, 04:03 PM IST
మృత్యువు అంచు వరకు హీరోయిన్.. కారుపై బుల్లెట్ల వర్షం.. దేవుడే బతికించాడు!

సారాంశం

తరచుగా సెలెబ్రిటీలు అనుకోని ప్రమాదాల బారీన పడడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో నటి ఊహించని ప్రమాదాన్ని ఎదుర్కొంది.

తరచుగా సెలెబ్రిటీలు అనుకోని ప్రమాదాల బారీన పడడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో నటి ఊహించని ప్రమాదాన్ని ఎదుర్కొంది. ఫిలిప్పీన్స్ కు చెందిన ప్రముఖ నటి కిమ్ చియు కారులో ప్రయాణిస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు ప్రారంభించారు. 

ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై 8 బుల్లెట్లు దిగాయి. కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కొన్ని రోజుల క్రితం ఈ సంఘటన జరగగా కిమ్ చియు సోషల్ స్పందించింది. చాలా మంది నాకు జరిగిన ప్రమాదం గురించి ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నారు. ప్రమాదం గురించి నేనిప్పుడే ఏమీ మాట్లాడలేను. కానీ ఆ దేవుడి దయ వల్లే బతికి బయటపడ్డాం. 

ఎన్టీఆర్ చిన్న కొడుకుపై హరీష్ కామెంట్స్.. వదిలితే దూకేస్తాడు!

నాతో పాటు డ్రైవర్, మేనేజర్ కూడా సేఫ్ గా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పులు జరుగుతున్న సమయంలో ఏం జరుగుతోందో నాకు ఏమీ అర్థం కాలేదు. బహుశా ఎవరైనా పొరపాటున కాల్పులు జరిపి ఉండొచ్చని కిమ్ చియు పేర్కొంది. కాకపోతే పూర్తి వివరాలు తెలియదు అని తెలిపింది. 

ఈ సంఘటన క్యూజొన్ నగరంలో జరిగింది. దీనిపై ఫిలిప్పీన్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?