యోగిబాబు ఇంత దారుణమైన వాడా?...నిర్మాత ఆత్మహత్య అంటున్నాడే

By Surya PrakashFirst Published Dec 8, 2022, 9:51 AM IST
Highlights

యోగిబాబు ప్రవర్తనతో  విరక్తి చెందిన నిర్మాత...మా కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటాము అని బెదిరించారు. అలాగే స్టేజి మీద కూడా అదే విషయాన్ని చెప్పారు.


తమిళ డబ్బింగ్ సినిమాలు చూసేవారికి యోగిబాబు బాగా పరిచయమే. ఆయన ఉంటే ఆ సినిమాకు ఫుల్ గా బిజినెస్ అవుతుంది. ఆయన హీరోగా సినిమాలు సైతం వస్తున్నాయి. ఈ నేపధ్యంలో యోగిబాబు కు ఓ రేంజిలో క్రేజ్ ఏర్పడింది. అదే సమయంలో ఆయన ప్రవర్తన కూడా ఇబ్బందిగా ఉంటోంది. ఓ నిర్మాత ఏకంగా  మా కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటాను అనే పరిస్దితి ఏర్పడింది అంటే ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఆలోచించాలి. వివరాల్లోకి వెళితే..

ఎనీ టైం మనీ  ఫిలిమ్స్‌ పతాకంపై గిన్నిస్‌ కిషోర్‌ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి నిర్మించిన చిత్రం దాదా. ఇందులో యోగి బాబు, నితిన్‌ సత్య కథానాయకులుగా, గాయత్రి హీరోయిన్ గా నటించారు. మనోబాలా, నాజర్, సింగం ముత్తు, భువనేశ్వరి, ఉమా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆర్‌హెచ్‌ అశోక్‌ చాయాగ్రహణను, కార్తీక్‌ కృష్ణ సంగీతాన్ని అందించారు. వినోదమే ప్రధానంగా రూపొందించిన దాదా చిత్రం ఈనెల 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. అయితే యోగిబాబు ఏ విధంగానూ ప్రమోషన్ కు సాయిపడకపోవటమే కాకుండా బిజినెస్ కాకుండా ఆపుతున్నారని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో విరక్తి చెందిన నిర్మాత...మా కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటాము అని బెదిరించారు. అలాగే స్టేజి మీద కూడా అదే విషయాన్ని చెప్పారు.

 చిత్ర దర్శక నిర్మాత గిన్నిస్‌ కిషోర్‌ మాట్లాడుతూ.. ఇందులో నటించిన యోగిబాబు చాలా ఇబ్బందులు పెట్టారని, చిత్రంలో తాను నటించింది 4 సన్నివేశాల్లోనే అంటూ, చిత్రాన్ని ఎవరు కొనుగోలు చేయవద్దని బయ్యర్లకు ఫోన్‌ చేసి మరి దుష్పచారం చేసి తన వ్యాపారానికి దెబ్బ కొట్టారని ఆరోపించారు. యోగిబాబు 4 సన్నివేశాలు నటించారో, 40 సన్నివేశాలు నటించారో చిత్రం చూసిన తర్వాత మీరే చెప్పాలన్నారు. 

అదే విధంగా చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడానికి చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. తన తదుపరి చిత్రంలో నటించడానికి యోగిబాబుకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చానని, అయితే ఇప్పుడు చిత్రంలో నటించడానికి ఆయన నిరాకరిస్తున్నారని, దీనిపై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన చిత్రంలో నటించకపోతే మరో చిత్రంలో నటించకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో  పేర్కొన్నట్లు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు యోగిబాబు తీరును తప్పుబట్టారు.   

click me!