'విజిల్' తెలుగు రైట్స్ కి ఎంత పెట్టారు...సేఫేనా?

By AN TeluguFirst Published Oct 23, 2019, 2:16 PM IST
Highlights

తెలుగు వెర్షన్ రైట్స్ కోసం పదిన్నర కోట్లు దాకా పెట్టారని సమాచారం. అయితే అసలు మార్కెట్ లేని సమయంలో ఇంత పెట్టడం అవసరమా అని విమర్శలు వచ్చినప్పటికీ, వీకెండ్ లో ఏ మాత్రం టాక్ బాగున్నా ఈ సినిమా రికవరీ ఇచ్చేస్తుందని నమ్మే పెట్టుబడి పెట్టారంటున్నారు.
 

తెలుగులో విజయ్ కు పెద్దగా చెప్పుకోదగ్గ మార్కెట్ లేదు. వరస పెట్టి  అతని సినిమాలు డబ్బింగ్ అయ్యి వచ్చి , బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేస్తున్నాయి. అయితే ఉన్నంతంలో అదిరింది చిత్రం రిలీఫ్ ఇచ్చింది. ఈ నేపధ్యంలో తన తాజా చిత్రం విజిల్ ని సైతం ఇక్కడ భారీగా రిలీజ్ చేసి హిట్ కొట్టాలని విజయ్ భావిస్తున్నారు. ఆ భాధ్యత  ఎన్టీఆర్ పీఆర్వో, మరియు నిర్మాత మహేష్ కోనేరు తీసుకున్నారు.

తెలుగు వెర్షన్ రైట్స్ కోసం పదిన్నర కోట్లు దాకా పెట్టారని సమాచారం. అయితే అసలు మార్కెట్ లేని సమయంలో ఇంత పెట్టడం అవసరమా అని విమర్శలు వచ్చినప్పటికీ, వీకెండ్ లో ఏ మాత్రం టాక్ బాగున్నా ఈ సినిమా రికవరీ ఇచ్చేస్తుందని నమ్మే పెట్టుబడి పెట్టారంటున్నారు.

ప్లేయర్స్ కి ‘విజిల్’తెలుగు నిర్మాతల గిప్ట్!

అయితే ట్రేడ్ వర్గాలు చెప్తున్నదేమిటంటే... ఈమధ్య తమిళ సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగులో హిట్ కాలేదు.   జనం డబ్బింగ్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఈ నేపధ్యంలో ఈ దీపావళికి రెండు డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి.  తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'బిగిల్'.. కార్తి నటించిన 'ఖైది' ఆ రెండు సినిమాలు.


 

విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామా 'బిగిల్‌'. నయనతార హీరోయిన్‌. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గణేశ్‌, కల్పాతి ఎస్‌.సురేశ్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'విజిల్‌' పేరుతో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు అందిస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది.  ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

'సినిమా లేడీస్‌ ఫుట్‌బాల్‌ క్రీడను ఆధారంగా చేసుకుని డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించగా రాజప్ప అనే మాస్‌ క్యారెక్టర్‌తో పాటు.. యంగ్‌ లుక్‌లోని మైకేల్‌ అనే ఫుట్‌బాల్‌ కోచ్‌ పాత్రలో విజయ్ నటన ఆకట్టుకుంటుంది. నయనతార గ్లామర్‌ సినిమాకు ఓ ప్లస్‌ కానుంది. లేడీస్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ను మైకేల్‌ ఎలా ట్రైన్‌ చేశాడు. అనే కాన్సెప్ట్‌తో కట్‌ చేసిన ట్రైలర్‌కు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తుంది' అని మహేశ్‌ కోనేరు  చెప్తున్నారు.


 

click me!