ముందుగా ఈ వారంలో హైలైట్ గా నిలిచిన రెండు విషయాలు ఒకటి పవన్ కళ్యాణ్ రీఎంట్రీ వార్త.. రెండోది బిగ్ బాస్ ఫినాలే. 'అజ్ఞాతవాసి' సినిమా తరువాత పవన్ సినిమాలకు దూరమయ్యాడు.
ఈ వారం లో సినిమా ఇండస్ట్రీలో జరిగిన కొన్ని విషయాలు, సినిమాల అప్డేట్స్, అలానే శుక్రవారం నాడు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వారంలో హైలైట్ గా నిలిచిన రెండు విషయాలు ఒకటి పవన్ కళ్యాణ్ రీఎంట్రీ వార్త.. రెండోది బిగ్ బాస్ ఫినాలే.
'అజ్ఞాతవాసి' సినిమా తరువాత పవన్ సినిమాలకు దూరమయ్యాడు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇక సినిమాలు చేయరని అనుకున్నారు. పవన్ కూడా తన రీఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని అన్నారు. కానీ అనూహ్యంగా పవన్ 'పింక్' రీమేక్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్, వేణుశ్రీరామ్ కాంబినేషన్ లో 'పింక్' తెలుగు రీమేక్ రాబోతుందని అనౌన్స్మెంట్ వచ్చింది.
Breaking: శ్రీముఖికి బిగ్ బాస్ షాక్.. ట్రోఫీ అతడికే!
ఇక వంద రోజులకు పైగా సాగిన బిగ్ బాస్ షో ఆదివారం నాటితో ఎండ్ కానుంది. ఈ షోలో శ్రీముఖి, రాహుల్ ల మధ్య టఫ్ కాంపిటిషన్ జరగడంతో ఎవరు టైటిల్ గెలుచుకోబోతున్నారనే ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రీముఖి, రాహుల్ లలో రాహుల్ టైటిల్ గెలుచుకోబోతున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు. ఏపీ సమకాలీన రాజకీయాల నేపధ్యంలో సాగిన ఈ ట్రైలర్ సెన్సేషన్ అయింది. ముఖ్యంగా ట్రైలర్ లో పప్పు సీన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
చాలా రోజులుగా స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న సుకుమార్, అల్లు అర్జున్ సినిమా ఎట్టకేలకు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
ప్రముఖ సీనియర్ నటి గీతాంజలికి గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెకి నివాళులు అర్పించారు.
ఈ వారం బాక్సాఫీస్ వద్ద రెండు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా', రెండోది రవిబాబు రూపొందించిన 'ఆవిరి'. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. దీంతో ఈ వారం బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా లేక వెలవెలబోతుంది.