దర్శకుడు వియన్ ఆదిత్య కొత్త చిత్రం ప్రకటన!

Published : Oct 31, 2019, 01:01 PM IST
దర్శకుడు వియన్ ఆదిత్య కొత్త చిత్రం ప్రకటన!

సారాంశం

ఆ తర్వాత చేసిన పార్క్ సినిమా రకరకాల కారణాలతో విడుదలకాలేదు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ లో స్క్రిప్టు కన్సల్టెంట్ గానూ, పీపుల్స్ మీడియాలోనూ క్రియేటివ్ సైడ్  ఆయన పనిచేసి తన ఇన్ పుట్స్ ఇచ్చారు. 

'మనసంతా నువ్వే' తో పరిచయమైన  దర్శకుడు వియన్ ఆదిత్య. ఆ సినిమా సంచలన విజయంతో వరస ఆఫర్స్ తో బిజీ అయ్యిపోయారు. అయితే తొలి సినిమా స్దాయి హిట్ మళ్లీ పలకరించకపోవటంతో ఆయన కెరీర్ పరంగా బాగా వెనకబడ్డారు.సురేష్ ప్రొడక్షన్స్ లో చేసిన ముగ్గురు సినిమానే రిలీజైన ఆయన ఆఖరి సినిమా.

ఆ తర్వాత చేసిన పార్క్ సినిమా రకరకాల కారణాలతో విడుదలకాలేదు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ లో స్క్రిప్టు కన్సల్టెంట్ గానూ, పీపుల్స్ మీడియాలోనూ క్రియేటివ్ సైడ్  ఆయన పనిచేసి తన ఇన్ పుట్స్ ఇచ్చారు. అదే సమయంలో సొంతంగా స్క్రిప్టు రాసుకునే పనిలో పడ్డారు. స్క్రిప్టు వర్క్  పూర్తి చేసి మళ్ళీ ఇన్నాళ్లకు మెగాఫోన్ పట్టుకుంటున్నాడు.
తాజాగా ఒక సినిమా ప్రకటించాడు. వాళ్ళిద్దరి మధ్య అంటూ ఒక టైటిల్ తో ఓ పోస్టర్ ని  ప్రకటించారు ఆదిత్య.

''ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేయాలి.. కాదని అవకాశాలిస్తే..''

వైవిధ్యమైన కథాంశంతో రెడీ అయిన ఈ కథ, ఈ జనరేషన్ ప్రేమలు, పెళ్లిళ్లు, అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళే నటిస్తున్నట్టు  చెప్పుకొచ్చారు ఆయన.  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం ఆయన కెరీర్ కు బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ రీఎంట్రీలో  మనసంతా నువ్వే తరహా హిట్ కొడతారని ఆశిద్దాం.  

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?