1,600 మందిని మోసం చేసిన నిర్మాత.. నిఘా వేసి అరెస్ట్ చేసిన పోలీసులు

By Prashanth MFirst Published Oct 31, 2019, 12:08 PM IST
Highlights

గత కోనేళ్ళుగా అమాయకులకు మాయమాటలు చెప్పి డబ్బులు దోచుకుంటున్న వ్యక్తిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే చాలా కేసును నందైనప్పటికీ కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్న ఆ నిర్మాత కోర్టు దగ్గరే పోలీసులకు చిక్కాడు. 

సినిమా పరిశ్రమలో మరో నిర్మాత అసలు రంగు బయటపడింది. గత కోనేళ్ళుగా అమాయకులకు మాయమాటలు చెప్పి డబ్బులు దోచుకుంటున్న వ్యక్తిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే చాలా కేసును నందైనప్పటికీ కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్న ఆ నిర్మాత కోర్టు దగ్గరే పోలీసులకు చిక్కాడు.

వివరాల్లోకి వెళితే.. పలు సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించిన ఎస్‌వీఎన్‌ రావునవ్యాంధ్ర ఫిలించాంబర్‌ వ్యవస్థాపకుడు. అయితే గత కొన్నాళ్లుగా అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతీ యువకులను మోసం చేస్తున్నట్లు ఈ నిర్మాతపై పలు కేసులు నమోదయ్యాయి. చాలా రోజులుగా పోలీసుల కంటపడకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న ఎస్‌వీఎన్‌ ని ఎట్టకేలకు తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తిరుపతిలో కూడా స్టూడియోని ఏర్పాటు చేసిన ఈ నిర్మాత లక్షల రూపాయలు వసూలు చేసినట్లు కేసులు నమోదయ్యాయి. హైదరాబద్ లోనే కాకుండా గుంటూరు, విజయవాడలో  కూడా చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. 1,600 మంది దగ్గర నుంచి ఎస్‌వీఎన్‌ మోసం చేసి డబ్బు గుంజినట్లు తెలుస్తోంది.   బాధితులు కేసు నమోదు చేయడంతో కోర్టు నోటీసులు అందినప్పటికీ ఎస్‌వీఎన్‌ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు.

ఫైనల్ గా పోలీసులు అతనిపై ప్రత్యేక నిఘా వేసి పట్టుకున్నారు. ఓ కేసుకు సంబంధించి బుధవారం తిరుపతి మూడవ అదనపు కోర్టుకు ఆయన హాజరవుతున్నట్టు సమాచారం అందుకున్న తిరుపతి పోలీసులు కనిపించగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్ గా కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతన్ని 14రోజుల రిమాండ్ లో ఉంచాలని ఆదేశాలు జారీచేశారు.

click me!