Vishwak Sen Upcoming Film : ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీ రిలీజ్ డేట్ ఫైనల్.. ఎప్పుడంటే?

Published : Apr 17, 2022, 03:44 PM IST
Vishwak Sen Upcoming Film : ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీ రిలీజ్ డేట్ ఫైనల్.. ఎప్పుడంటే?

సారాంశం

యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వస్ సేన్ (Vishwak Sen) ప్రస్తుతం వరస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తను నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.   

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరు చిత్రాల్లో నటిస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. చివరిగా ‘పాగల్’ చిత్రంత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ కు కాస్తా నిరాశే మిగిలింది. దీంతో విభిన్న కథలు ఎంచుకుంటూ ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తున్నారు.  విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (AshokaVanamlo Arjuna Kalyanam). ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 

ఇప్పటికే అశోకవనంలో అర్జున కళ్యాణం.. చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. గతనెల 4నే రిలజ్ చేస్తున్నట్టు మేకర్స్ టీజర్ రిలీజ్ చేస్తూ గతంలో అనౌన్స్ చేశారు. కానీ పెద్ద సినిమాల సందడి నెలకొనడంతో వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 6న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్నిప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రుష్కర్ దిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విద్యాసాగర్ డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ టీజర్స్  కూడా రిలీజ్ అయి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఏజ్ పెరిగిపోయిన అబ్బాయికి పెళ్లి కుదిరితే, అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సెట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు, మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయితో ఎలా ఉన్నాడు అనే కథాంశంతో కామెడీ, ఎమోషనల్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. టీజర్ లోనే సినిమా కథని ఇండైరెక్ట్ గా చెప్పేశారు మేకర్స్. కామెడీతో పాటు  ఎమోషనల్ గా కూడా చూపించారు.

విభిన్న కథలు ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు విశ్వక్. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’.. వంటి చిత్రాలతో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్నాడు. ప్రస్తుతం‘అశోకవనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా, ముఖ చిత్రం’ సినిమాలను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ‘దాస్ కా ధమ్కీ’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు.    

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?