విజయశాంతి రీఎంట్రీ.. మహేష్ ని మించిందా..?

By AN TeluguFirst Published Jan 11, 2020, 2:17 PM IST
Highlights

విజ‌య‌శాంతి న‌ట‌న‌, ఆమె ఇమేజ్,స్టార్ డమ్ చిత్రంలో పాత్ర‌కి మరింత వన్నె తెచ్చింది. ఈ సినిమాలో విజయశాంతి పాత్ర పేరు భారతి. ఆమె మెడిక‌ల్ కాలేజ్ ప్రొఫెస‌ర్‌. చిన్న త‌ప్పును కూడా భ‌రించ‌ని వ్య‌క్తి ఆమె. 

మెసేజ్ సినిమాలు చేస్తూ వస్తున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఈ రోజు  `స‌రిలేరు నీకెవ్వ‌రు` అంటూ ప‌క్కా ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంతో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో కామెడీ గురించి కొందరు మాట్లాడుతూంటే, మరికొందరు ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని చెప్తున్నారు. ఇవేమీ కాదు మైండ్ బ్లాక్ పాట అదిరిపోయిందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే వీళ్లంతా ఒప్పుకునే ఒకే ఒక విషయం..విజయశాంతి లేకుండా ఈ సినిమాని చూడలేము అని. 13 ఏళ్ల త‌ర్వాత లేడీ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాలో ఆమె పాత్ర జనాలకి బాగా నచ్చిందనే చెప్పాలి. ఆ పాత్రలో వేరకొకరిని ఊహించుకోలేమనంత గ్రేస్ ఫుల్ గా ఆమె నటించారు.  

విజ‌య‌శాంతి న‌ట‌న‌, ఆమె ఇమేజ్,స్టార్ డమ్ చిత్రంలో పాత్ర‌కి మరింత వన్నె తెచ్చింది. ఈ సినిమాలో విజయశాంతి పాత్ర పేరు భారతి. ఆమె మెడిక‌ల్ కాలేజ్ ప్రొఫెస‌ర్‌. చిన్న త‌ప్పును కూడా భ‌రించ‌ని వ్య‌క్తి ఆమె. అలాగే దేశభక్తిని అణువణునా నింపుకుని జీవిస్తూంటుంది. అందుకే  త‌న పెద్ద‌కొడుకు ఆర్మీలో చ‌నిపోయిన‌ప్ప‌టికీ చిన్న‌కొడుకు ఆర్మీకి పంపుతుంది.

'అల వైకుంఠపురంలో' స్టోరీ.. సైట్ లో పెట్టేసిన సెన్సార్ బోర్డ్!

ఆ తర్వాత కొడుకు చనిపోయాడనే విషయం తనకు ముందే తెలుసు అని చెప్పేటప్పుడు ఆమె నటన, ఆమె చూసే చూపు ఓ గొప్ప పాత్రను పరిచయం చేస్తున్నట్లుగా ఉంటుంది. నటనకు బై చెప్పి రీ ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్‌లోనూ, డైలాగు డెలివ‌రీలోనూ ఆమె గ్రేస్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. మీ ఇంటికి ఓ మగాడు అవసరం అంటూ చెప్పిన డైలాగ్ కు విజిల్స్ పడ్డాయి.
 
విజయశాంతి సహజమైన అభినయం, డైలాగ్‌ డెలివరీ సినిమాకు ఖచ్చితంగా నిండుతనం తెచ్చాయి. నిజాయితీగా గల ప్రొఫెసర్‌గా, ఆర్మీలో కొడుకులను కోల్పోయిన తల్లిగా ఆమె నటన చూసేవారిలో గౌరవభావాన్ని, కంటతడిని పెట్టిస్తాయి. క‌చ్చితంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించే ఫ్యాక్ట‌ర్ విజయశాంతి అవుతుంది.
 
మరీ ముఖ్యంగా ప్రకాశ్‌రాజ్‌కు ఛాలెంజ్ విసిరే సీన్ లో  ఆమె లో నటి మన ముందుకు వచ్చి నిలబడుతుంది. అలాగే ఆర్మీ గొప్పదనం గురించి విజయశాంతి, మహేష్ మాట్లాడుకునేటప్పుడు ఆమె నటనానుభవం కనపడుతుంది. ఏదైమైనా అలనాటి విజయశాంతిని ప్రేక్షకులకు మళ్లీ గుర్తు చేయటం ఆమె అభిమానులకు పండగే.

 

click me!