వరల్డ్ పేమస్ లవర్.. సినిమాలో అసలు కిక్కు అదేనట!

Published : Feb 08, 2020, 04:02 PM ISTUpdated : Feb 08, 2020, 04:11 PM IST
వరల్డ్ పేమస్ లవర్.. సినిమాలో అసలు కిక్కు అదేనట!

సారాంశం

విజయ్ దేవరకొండ నెక్స్ట్ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా నలుగురు హీరోయిన్స్ తో విజయ్ రొమాన్స్ చేస్తున్నాడు. అయితే ఇదే ఆడియెన్స్ లో కొంత ఆసక్తిని కలిగిస్తుందని చెప్పవచ్చు.

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా నలుగురు హీరోయిన్స్ తో విజయ్ రొమాన్స్ చేస్తున్నాడు. అయితే ఇదే ఆడియెన్స్ లో కొంత ఆసక్తిని కలిగిస్తుందని చెప్పవచ్చు.  గత సినిమాలతో పోలిస్తే విజయ్ ఎందుకో ఈ సినిమాపై అనుకున్నంతగా బజ్ క్రియేట్ చేయలేకపోతున్నాడు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కినప్పటికీ భారీ హైప్ మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. అసలు మ్యాటర్ లోకి వస్త.. సినిమాలో ఒక ఎపిసోడ్ మాత్రం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. సినిమాలో రౌడీ బాయ్ విభిన్నమైన నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో సింగరేణి కార్మికుడి రోల్ సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. ఆ  పాత్రలో విజయ్ ఫుల్ కామెడీ తో పాటు మంచి ఎమోషనల్ ఫీలింగ్ ని ప్రజెంట్ చేయనున్నాడట.

అదే ఈ సినిమాకు మంచి కిక్కిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరీ ఆడియెన్స్ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఓనమాలు - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?