'నువ్ ఎన్ని రోజులు ఇలా ఉంటావో నేనూ చూస్తా'.. మెగాహీరోకి మంచు విష్ణు కౌంటర్!

Published : Feb 08, 2020, 03:55 PM ISTUpdated : Feb 08, 2020, 03:56 PM IST
'నువ్ ఎన్ని రోజులు ఇలా ఉంటావో నేనూ చూస్తా'.. మెగాహీరోకి మంచు విష్ణు కౌంటర్!

సారాంశం

సుబ్బు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. 

ఇటీవల 'ప్రతిరోజు పండగే' చిత్రంతో సక్సెస్ అందుకున్న హీరో సాయి ధరం తేజ్ ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాలో నటిస్తున్నారు. సుబ్బు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోలోగా ఉంటే వచ్చే లాభాలను తెలియజేస్తూ సాయి తేజ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. 'సోలో బ్రతుకే సో బెటర్'గా తను లైఫ్ లీడ్ చేస్తున్నానని.. ఎందుకంటే.. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే పెడగా టెన్షన్ పడనని, రెస్టారంట్ కి వెళ్తే తన ఫుడ్ కి మాత్రమే తను బిల్లు చెల్లిస్తానని సో.. పర్స్ కి బొ*పడే ఛాన్స్ లేదని చెప్పాడు.

మహేష్ నెక్స్ట్ 4 ప్రాజెక్ట్స్.. క్యూలో టాప్ డైరెక్టర్స్!

క్రికెట్ ఆడేప్పుడు ఫోన్ వచ్చి గేమ్ మధ్యలో వెళ్లాల్సిన పని లేదని.. షూటింగ్, క్రికెట్, జిమ్, ఇల్లు, ఫ్రెండ్స్ ఇలా తనకు నచ్చినవాళ్లతో నచ్చినంత సమయాన్ని గడపవచ్చని చెప్పారు. ఈ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'సింగిల్ ఆర్మీ జీవితాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను' అంటూ తన అభిమానులను కోరాడు.

ఇది చూసిన మంచు విష్ణు.. 'తమ్ముడూ సాయి తేజ్.. నువ్ పెట్టిన ఈ ట్వీట్ ని నేను సేవ్ చేసుకున్నా.. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తాగా.. ఆల్ ది బెస్ట్ ఫర్ 'సోలో బ్రతుకే సో బెటర్' అని సరదాగా కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన సాయి తేజ్.. 'విష్ణు అన్నా.. అందరూ నీలాగా అదృష్టవంతులు ఉండరు కదా' అని బదులిచ్చాడు.  

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?