Vikrant Rona:‘విక్రాంత్ రోణ’కలెక్షన్స్ తెలిస్తే ..మైండ్ బ్లాకే

By Surya PrakashFirst Published Jul 31, 2022, 10:40 AM IST
Highlights

ఈ సినిమాకు కేజీఎఫ్ స్దాయిలో టాక్ అయితే రాలేదు కానీ కలెక్షన్స్ మాత్రం తెలుగులో కూడా బాగున్నాయి. సరైన సినిమా పడితే థియేటర్స్ జనం వస్తన్నారనే విషయం ఈ సినిమా నిరూపించింది.
 


కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కొత్త మూవీ విక్రాంత్ రోణా. బాలీవుడ్ నటి జాక్వలీన్ ఫెర్నాండజ్, నీతా అశోక్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి అనుప్ భండారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ సినిమాకు కేజీఎఫ్ స్దాయిలో టాక్ అయితే రాలేదు కానీ కలెక్షన్స్ మాత్రం తెలుగులో కూడా బాగున్నాయి. సరైన సినిమా పడితే థియేటర్స్ జనం వస్తన్నారనే విషయం ఈ సినిమా నిరూపించింది.

ఈ వీకెండ్లో   తెలుగులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ పూర్తి నెగెటివ్‌ టాక్‌తో మొదలైంది. హిందీలో ‘ఏక్ విలన్ రిటర్న్స్’కు మిక్స్‌డ్ టాక్ రావటంతో జనాలు ఈ సినిమాకే వెళ్తున్నారు. రవితేజ సినిమా వీకెండ్ లో కూడా నిలబడే పరిస్థితి అసలు కనిపించడం లేదు. కలెక్షన్స్ పూర్తి డ్రాప్ అయ్యాయి. దీంతో పోలిస్తే ‘ఏక్ విలన్ రిటర్న్స్’ మెరుగైన కలెక్షన్స్ రాబట్టేలా ఉంది.  

ఇక  కన్నడలో మిక్సెడ్ టాక్‌తో మొదలైన కిచ్చా సుదీప్ సినిమా ‘విక్రాంత్ రోణ’కు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లే రాబట్టి ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. కర్ణాటకలో అయితే ఇది ఆల్ టైం డే-1 హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. వరల్డ్ వైడ్ ‘విక్రాంత్ రోణ’కు తొలి రోజు రూ.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. ‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీ తర్వాత ఓ కన్నడ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే కావంటో సినీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 ‘విక్రాంత్ రోణ’లోని ‘రా రా రక్కమ్మ’ పాట కు వస్తున్న రెస్పాన్స్ కలిసొస్తోందంటున్నారు. ఈ పాట సోషల్ మీడియాలో రెండు నెలలుగా ఊపేస్తోంది. ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్ షార్ట్స్‌లో ఎక్కడ చూసినా ఈ పాటే. కేవలం ఈ పాట కోసమే సినిమా చూడాలని అనుకున్న వాళ్లు థియేటర్స్ దగ్గర క్యూలు కడుతున్నారు. సినిమా కూడా ఎగ్జైటింగ్‌గానే ఉండడంతో అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల ఆసక్తి నెలకొంది.
 

click me!