'ఏందే నీ యవ్వ గారు గారు అంటున్నావ్'.. హీరోయిన్ తో విజయ్ దేవరకొండ

By tirumala AN  |  First Published Feb 9, 2020, 10:07 PM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న మరో ఎమోషనల్ ప్రేమ కథ ఇది.


రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న మరో ఎమోషనల్ ప్రేమ కథ ఇది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. 

ప్రీరిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ అభిమానులని ఉత్సాహపరిచే ప్రసంగం చేశాడు. నాలుగేళ్ళ క్రితం పెళ్లి చూపులు చిత్రంతో తాను సోలో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించానని విజయ్ దేవరకొండ తెలిపాడు. ఈ జర్నీలో కొన్ని చిత్రాల్లో నటించా. వాటిలో కొన్ని చిత్రాలు బౌండరీ అవతల సిక్సర్ పడ్డాయి. మరికొన్ని బౌండరీ దాటలేదు. 

Latest Videos

undefined

నేనైతే ప్రతి చిత్రంతో సిక్సర్ కొడుదామనే బరిలోకి దిగుతా. ఏమైనా పర్వాలేదు అనే ధైర్యం నాకు ఈ జర్నీలో వచ్చింది. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో కూడా సిక్సర్ కొట్టేందుకే ప్రయత్నించా. ప్రస్తుతం బంతి గాల్లో ఉంది. సినిమా విడుదలయ్యాక ఇది సిక్సరా కాదా అనేది మీరే చెప్పాలి. ఇంతకు ముందే చెప్పా ఇదే నా చివరి ప్రేమ కథ అని. 

అందుకే ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ పండించాం. నేను మూడు రకాల పాత్రల్లో కనిపిస్తా. గనుల్లో పనిచేసే శీనయ్యగా, పారిస్ లో పైలట్ తో ప్రేమ సాగించే యువకుడిగా, హైదరాబాద్ లో మరో అమ్మాయితో ప్రేమ సాగించే యువకుడిగా కనిపిస్తా. ఇక హీరోయిన్లయితే అద్భుతంగా నటించారు. నేను ఒక్కడినే సిక్సర్ కొడితే సరిపోదు. పార్టనర్ షిప్ కూడా అవసరం. హీరోయిన్లు అద్భుతమైన పార్ట్నర్ షిప్ అందించారు. 

తన ప్రసంగం మధ్యలో విజయ్ అక్కడే ఉన్న హీరోయిన్లతో సరదాగా మాట్లాడాడు. ఐశ్వర్యరాజేష్, విజయ్ దేవరకొండ మధ్య సరదా సంభాషణ జరిగింది. 'ఏందే నీ యవ్వ.. గారు గారు అంటున్నవ్' అని ఐశ్వర్య రాజేష్ ని విజయ్ దేవరకొండ సరదాగా తిట్టడం అక్కడ నవ్వులు పూయించింది. తన చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అభిమానులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. 

click me!