ఆ హీరోయిన్ నెంబర్ కావాలని డైరెక్టర్ ని అడిగా : విజయ్ దేవరకొండ!

Published : Oct 11, 2019, 02:22 PM ISTUpdated : Oct 11, 2019, 02:29 PM IST
ఆ హీరోయిన్ నెంబర్ కావాలని డైరెక్టర్ ని అడిగా : విజయ్ దేవరకొండ!

సారాంశం

ఓ హీరోయిన్ నంబర్ కావాలని ఏకంగా ఓ డైరెక్టర్ ని అడిగాడట విజయ్ దేవరకొండ. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? అలియా భట్. 

'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో విజయ్ దేవరకొండ సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ హీరో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ ప్రముఖ మ్యాగజైన్ వోగ్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ హీరోయిన్ నంబర్ కావాలని ఏకంగా ఓ డైరెక్టర్ ని అడిగాడట విజయ్ దేవరకొండ. ఇంతకీ ఆ హీరోయిన్  ఎవరో తెలుసా..? అలియా భట్. అలియాకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కి మంచి సాన్నిహిత్యం ఉంది.

కరణ్ జోహార్ నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో అలియా బాలీవుడ్ కి పరిచయమైంది. ఇప్పటికీ అలియాకి సినిమాలకు సంబంధించి కరణ్ జోహార్ సలహాలు ఇస్తూనే ఉంటాడు. అందుకే అలియా నెంబర్ కావాలని విజయ్ దేవరకొండ.. కరణ్ జోహార్ ని అడిగాడట. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించాడు.

టైం కాని టైం లో ఓ సారి కరణ్ జోహార్ కి ఫోన్ చేసి.. అలియా భట్ నెంబర్ కావాలని అడిగాడట విజయ్. మరోలాఅనుకోవద్దని అలియా నటించిన 'గల్లీ బాయ్' సినిమా చూసిన తరువాత అందులో ఆమె నటన చాలా నచ్చిందని, సినిమా చూసాక అసలు నిద్ర పట్టలేదని.. అందుకే అలియాకి కంగ్రాట్స్ చెప్పాలని నెంబర్ అడిగానని అసలు విషయం చెప్పుకొచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?