అల్లు అర్జున్ సినిమాకు ఏమైంది.. అటకెక్కినట్లేనా?

Published : Oct 11, 2019, 02:17 PM IST
అల్లు అర్జున్ సినిమాకు ఏమైంది.. అటకెక్కినట్లేనా?

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంతో అభిమానులని సంతోషపరచాలని ప్రయత్నిస్తున్నాడు. నా పేరు సూర్య చిత్ర ఫ్లాఫ్ తర్వాత బన్నీ చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శత్వంలో అల.. వైకుంఠపురములో చిత్రంలో నటిస్తున్నాడు. 

త్రివిక్రమ్, బన్నీ క్రేజీ కాంబోలో తెరక్కుతున్న చిత్రం అల.. వైకుంఠపురములో. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తన తదుపరి చిత్రాల విషయంలో కూడా బన్నీ జాగ్రత్తలు వహిస్తున్నాడు. చాలా రోజుల క్రితం సుకుమార్, బన్నీ కాంబోలో హ్యాట్రిక్ మూవీ ఖరారైంది. కానీ ఇంతవరకు ఫైనల్ స్క్రిప్ట్ రెడీ కాలేదని సమాచారం. కథ విషయంలో అల్లు అర్జున్ అంతలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఈ ఏడాది బన్నీ ఓకే చేసిన మరో ఆసక్తికర ప్రాజెక్ట్ 'ఐకాన్'. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు.త్రివిక్రమ్, సుకుమార్ చిత్రాల తర్వాత ఐకాన్ ప్రారంభం అవుతుందని అంతా భావించారు. ఈ చిత్ర ప్రాథమిక కథని బన్నీ ఓకే చేశాడు. కానీ ఇటీవల దర్శకుడు ఫైనల్ వర్షన్ నెరేట్ చేయగా అల్లు అర్జున్ కు నచ్చలేదని వార్తలు వస్తున్నాయి. 

ఈ చిత్ర కథ మోటార్ బైక్ చుట్టూ తిరుగుతుందని వార్తలు వచ్చాయి. ఫిక్షనల్ మూవీ 'మోటార్ సైకిల్ డైరీస్' కథ ఆధారంగా ఐకాన్ కథని రూపొందించినట్లు తెలుస్తోంది. ఐకాన్ కథ బన్నీకి నచ్చక పోవడంతో ఇక ఈ ప్రాజెక్ట్ ఇప్పటిలో ఉండే అవకాశం కనిపించడం లేదు. 

బన్నీకి తగ్గట్లుగా వేణు శ్రీరామ్ కథలో మార్పులు చేస్తాడా లేక వేరే కథతో అప్రోచ్ అవుతాడా అనేది వేచి చూడాలి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?