తాజాగా హీరోయిన్ రాశిఖన్నాపై విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గురించి అందరికీ తెలిసిందే. తను చెప్పాలనుకున్న విషయాన్ని ఎలాంటి మొహమాటాలు లేకుండా ఓపెన్ గా చెబుతుంటాడు. తను మాట్లాడే విధానం అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. కానీ కొన్ని సార్లు మాత్రం విజయ్ వేసే సెటైర్లు, కామెంట్స్ ని ట్రోల్ చేస్తుంటారు.
తాజాగా హీరోయిన్ రాశిఖన్నాపై విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో విజయ్ తన సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు ఇషాబెల్లా, రాశిఖన్నాలతో కలిసి కొన్ని ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
undefined
పబ్లిక్ ఈవెంట్ లో జారిన విజయ్ దేవరకొండ లుంగీ.. అలర్ట్ అయిన రాశి!
ఈ క్రమంలో యాంకర్ రాశిఖన్నాని.. ఛాన్స్ వస్తే ఎవరితో డేట్ చేస్తారని ప్రశ్నిస్తే.. దానికి ఆమె డాక్టర్ అంటూ బదులిస్తూ.. వారైతే బాగా అర్ధం చేసుకుంటారని.. నటులుగా మేం ఎంత బిజీగా ఉంటామో.. వారు కూడా అంతే బిజీగా ఉంటారని చెబుతుండగా.. దానికి విజయ్ దేవరకొండ 'కానీ వాళ్లు టైం ఇవ్వరు తెలుసా.. తను(డాక్టర్) నిన్ను చూసినప్పుడు నిన్నుగా చూడలేడు.. నీ బుగ్గలు చూస్తే.. ఏదో మెడికల్ టర్మ్ గుర్తొస్తుంది.. అలానే నీ చెస్ట్ ని చూస్తే.. అప్పర్ తొరాక్స్' అంటూ ఇంకా తన బాడీ పార్ట్స్ ని వివరించే ప్రయత్నం చేయగా.. వెంటనే రాశి 'ఏంటి ఇదంతా అర్జున్ రెడ్డి ఫీలా' అంటూ టాపిక్ ని డైవర్ట్ చేసింది.
ఈ వీడియో చూసిన వారు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఓపెన్ గా మాట్లాడడంలో తప్పేముందని అంటుంటే మరికొందరు మాత్రం.. ఒక హీరో అయి ఉండి బాధ్యతగా వ్యవహరించడం మానేసి.. ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ విజయ్ పై కామెంట్స్ చేస్తున్నారు.
_ Bhayya, neeku lakhs.lo fans unnaru, konchem alochinchi maatladalsina responsibility undhi nee meeda. pic.twitter.com/tUQobMeBOa
— Delivery Of Thoughts (@DotsByHari)