దీపావళి గిఫ్ట్.. లేడీ అమితాబ్ లుక్!

Published : Oct 26, 2019, 10:00 AM IST
దీపావళి గిఫ్ట్.. లేడీ అమితాబ్ లుక్!

సారాంశం

ఇప్పటికే సినిమాలో ఆమె ఎలా ఉండబోతుందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా సినిమాలో ఆమె లుక్ బయటకి వచ్చింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. చాలా సంవత్సరాల తరువాత ఈ సినిమా ద్వారా సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఈ సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే సినిమాలో ఆమె ఎలా ఉండబోతుందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా సినిమాలో ఆమె లుక్ బయటకి వచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం ఆమె లుక్ ని విడుదల చేశారు.

(Also Read) సెగలు రేపుతున్న తెలుగు బ్యూటీ.. బ్లాక్ డ్రెస్ లో రెచ్చిపోయిందిగా

'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుండి భారతిగా మన లేడీ అమితాబ్ విషయశాంతి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మహేష్ ఈ సినిమాలో మేజర్ అజయ్ కృష్ణగా  కనిపించనున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పతాకాలపై దిల్ రాజు, అనీల్ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?