'నేనే డైరెక్టర్ అయితే అనసూయని..' విజయ్ దేవరకొండ కామెంట్స్!

Published : Nov 01, 2019, 04:22 PM IST
'నేనే డైరెక్టర్ అయితే అనసూయని..' విజయ్ దేవరకొండ కామెంట్స్!

సారాంశం

విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న సినిమాలో ఛాన్స్ రాగానే అనసూయ యాక్సెప్ట్ చేసి నటించింది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా సమయంలో అతడిని దూషిస్తూ, విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది యాంకర్ అనసూయ. ఆ సమయంలో విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

అయినప్పటికీ అనసూయ మాత్రం వెనక్కి తగ్గలేదు. అలాంటిది విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న సినిమాలో ఛాన్స్ రాగానే అనసూయ యాక్సెప్ట్ చేసి నటించింది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ చాలా అంచనాలు పెట్టుకున్నాడు.

 

 

దీనికోసం తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో అనసూయతో గొడవపై ప్రశ్నించగా.. తనకు క్షమించే స్వభావం ఉందని.. ఈ సినిమా కోసం అనసూయని ఎంపిక చేసింది దర్శకుడేనని చెప్పారు.

Meeku Matrame Cheptha: మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

ఆమె అయితేనే పాత్రకు సరిపోతారని చెప్పడంతో ఆమెని ఫైనల్ చేసినట్లు చెప్పాడు. వ్యక్తిగత వివాదాలా కంటే పనే ముఖ్యమని, ఒకవేళ తనే గనుక సినిమాకి డైరెక్టర్ గా పని చేసి ఉంటే అనసూయని తీసుకునేవాడ్నో.. లేదో చెప్పలేనని అన్నారు. తను డైరెక్ట్  చేయలేదు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ లోనూ జోక్యం చేసుకోలేదని అన్నారు.

దర్శకుడి ఇష్టప్రకారమే నటీనటుల ఎంపిక జరిగిందని.. షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారి కూడా తాను సెట్స్ కి వెళ్లలేదని అన్నాడు. అనసూయ తమ సినిమాలో నటించడానికి  ఒప్పుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని అన్నారు. పాత్ర ప్రకారం ఆమె బాగా నటించిందని అన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?