Rgv : ‘కేజీఎఫ్’ప్రభంజనంపై వర్మ ట్వీట్స్.. స్టార్ రెమ్యునరేషన్ కోసం డబ్బు వృథా చేయొద్దు.. ఆర్జీవీ హిట్ ఫార్మూలా

Published : Apr 18, 2022, 11:18 AM ISTUpdated : Apr 18, 2022, 11:20 AM IST
Rgv : ‘కేజీఎఫ్’ప్రభంజనంపై వర్మ ట్వీట్స్.. స్టార్ రెమ్యునరేషన్ కోసం డబ్బు వృథా చేయొద్దు.. ఆర్జీవీ హిట్ ఫార్మూలా

సారాంశం

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varam) కేజీఎఫ్ ప్రభంజనంపై తనదైన శైలిలో స్పందించారు. హిట్ చిత్రాలు రావాలంటే డబ్బును సరైన విధంగా ఖర్చుచేయాలంటూ హిట్ ఫార్మూలాను రివీల్ చేశాడు.   

కన్నడ ఫిల్మ్ కేజీఎఫ్ ఛాప్టర్ 1 మరియు ఛాప్టర్ 2 (kgf 2) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛాప్టర్ వన్ తో ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా సినిమాగా వచ్చిన Kgf Chapter 1 క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా సత్తాను చాటింది. ఈ దెబ్బతో కేజీఎఫ్ రెండవ భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ఏప్రిల్ 14న రిలీజ్ అయిన Kgf Chapter 2 అంచనాలను మించి పోతోంది. ఒక్కో రికార్డును బ్రేక్ చేసుకుంటూ పోతున్నాడు రాఖీ బాయ్. ఈ క్రమంలో అన్ని ఇండస్ట్రీల నుంచి విశేషంగా ప్రశంసలు  పొందుతోంది కేజీఎఫ్ టీం. 

తాజాగా రామ్ గోపాల్ వర్మ (Rgv) కేజీఎఫ్ ప్రభంజనంపై స్పందించారు. కేజీఎఫ్ హిట్ ఫార్మూలా పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ లో వరుస  ట్వీట్లు చేశారు. మొదటి ట్వీట్ లో ‘స్టార్ రెమ్యునరేషన్‌ల కోసం డబ్బును వృథా చేయకండి. సినిమా మేకింగ్ పై ఖర్చు చేస్తే మరింత నాణ్యతగా, గొప్ప హిట్‌ సినిమాలు పుట్టుకొస్తాయి.  KGF 2 విజయమే ఇందుకు స్పష్టమైన ప్రూఫ్’ అని తెలియజేశారు.

ఆ తర్వాత ట్వీట్ లో  ‘హిందీ చిత్ర పరిశ్రమను మరచిపోండి, తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలు కూడా KGF వరకు కన్నడ చిత్ర పరిశ్రమను సీరియస్‌గా తీసుకోలేదు.  కానీ దర్శకుడు ప్రశాంత్  నీల్ ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచ పటంలో పెట్టారు’ అంటూ పేర్కొన్నాడు. మరో ట్వీట్ లో.. ‘విలన్‌లను మెషిన్ గన్ లుగా మార్చేందుకు రాకీ భాయ్ ముంబైకి ఎలా వస్తాడో..  అలాగే కన్నడ స్టార్ యష్ కూడా మెషిన్ గన్ తో బాలీవుడ్ స్టార్స్ అన్ని ఓపెనింగ్ కలెక్షన్స్, ఫైనల్ కలెక్షన్స్ పై అణుబాంబు విసిరారు’ అని యష్ క్రియేట్ చేసిన సెన్సేషన్ ను వివరించాడు. 

 

 

ఇక చివరి ట్వీట్ లో బాలీవుడ్ స్టార్స్ పరిస్థితిపై సంచన కామెంట్ చేశారు. కేజీఎఫ్ దెబ్బకు  వారు ఎలాంటి ఫేజ్ ను ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పారు.  ‘ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF2 కేవలం గ్యాంగ్‌స్టర్ చిత్రం మాత్రమే కాదు. ఇది బాలీవుడ్ పరిశ్రమకు హారర్ చిత్రం కూడా.  భవిష్యత్  లో ఈ చిత్ర విజయం గురించి బాలీవుడ్ పీడకలలు కనాల్సిందే’ అని భావిస్తూ ట్వీట్ చేశారు. మొత్తం గా సూపర్ స్టార్ల మితిమీరిన రెమ్యునరేషన్ సినిమాల నాణ్యతను దెబ్బతీస్తోందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. మరోవైపు, 'కెజిఎఫ్ 2' వంటి సినిమాలు రెమ్యూనరేషన్‌పై అయ్యే ఖర్చులను నియంత్రించడంతో బడ్జెట్‌ను విజువల్స్, సెట్స్ మరియు ఇతర అవసరాలక ఖర్చు చేస్తే హిట్ సినిమాలు తప్పకుండా వస్తాయని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?