డబల్ స్టాండర్డ్స్ : తనదాకా రాగానే మాట మార్చేసిన సురేష్ బాబు!

By AN TeluguFirst Published Jan 13, 2020, 9:36 AM IST
Highlights

రిలీజ్ డేట్ నుంచి 50 రోజులు పూర్తయ్యాకే అమెజాన్ ప్రైమ్ కు ఇవ్వాలని, అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఓ రూల్ పాస్ చేయాలని అన్నారు. అందరూ శభాష్ అన్నారు. కానీ అన్ని కబుర్లు చెప్పిన సురేష్ బాబే..తనదాకా వచ్చేసరికి మాట మార్చాడు. 

సినిమా విడుదల అయి నెలరోజులు కూడా కాకముందే అదే సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో దర్శనం ఇవ్వడం వలన, ఇప్పుడు చూడకపోతే ఏమి, మరొక నెలరోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో హ్యాపీగా హెచ్ డి క్వాలిటీ సినిమాని హాయిగా ఇంట్లోనే కూర్చుని చూడొచ్చని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారని, అదే ఒక విధంగా సినిమాల కలెక్షన్స్ పై చావు దెబ్బకొడుతోందని కొద్ది రోజులు క్రితం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేసారు. థియేటర్స్‌కు జీతం సంగతి పక్కన పెడితే కనీసం కరెంట్ బిల్ కూడా కట్టలేని స్టేజ్‌లో ఉండటం తనకే ఆశ్చర్యం కలిగిస్తుందని, దీనికి కారణం అమేజాన్, నెట్ ఫ్లిక్స్ అని ఆయన చెప్పుకొచ్చాడు. అందరూ నిజమే కదా  అన్నారు.

రిలీజ్ డేట్ నుంచి 50 రోజులు పూర్తయ్యాకే అమెజాన్ ప్రైమ్ కు ఇవ్వాలని, అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఓ రూల్ పాస్ చేయాలని అన్నారు. అందరూ శభాష్ అన్నారు. కానీ అన్ని కబుర్లు చెప్పిన సురేష్ బాబే..తనదాకా వచ్చేసరికి మాట మార్చాడు. వెంకీ మామ సినిమాను నెల కూడా పూర్తవకుండానే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ఓకే అనేసాడు.  దాంతో సురేష్ బాబు డబల్ స్టాండర్డ్స్ ఈ విషయంలో బయిటపడ్డాయని అంతటా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని సైతం ఆయన తెలివిగా కవర్ చేసే ప్రయత్నం చేసారు.

కోట్లు వదిలేసి పిచ్చోడిలా పవన్.. చిరంజీవిపై విరుచుకుపడ్డ అశ్వినీ దత్!

సురేబాబు మాట్లాడుతూ... ఓటిటి ప్లాట్ ఫామ్స్ ను తినేస్తాయి, అలా అని అవి ఉండకూడదని అర్ధం కాదు. వాటిని ఎప్పుడు విడుదల చేయాలో తెలుసుకోవాలి. మంచి సినిమా తీస్తే థియేటర్ కు రాకుండా ప్రేక్షకుడిని ఎవరూ అడ్డుకోలేరు కదా, అదే పేలవమైన సినిమా తీస్తే థియేటర్ లోనే కాదు ప్రైమ్ వంటి వాటిలో కూడా ఆడదు. కాబట్టి నిర్మాతలకు ఇచ్చే సలహా కంటెంట్ విషయంలో రాజీ పడకండి. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే థియేటర్ లో సినిమా అదే ఆడుతుంది అని తేల్చి చెప్పాడు. ఇది విన్న ఇండస్ట్రీ జనం షాక్ అయ్యారు.
 
నిజ జీవిత మామా అల్లుళ్లైన వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’ . కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్స్. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.  డిసెంబర్‌ 13 అంటే వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌  అయ్యింది.  కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.  
 

click me!