మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరో. వరుణ్ తేజ్ చిత్రాలు మీడియం బడ్జెట్ లో తెరకెక్కుతూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరో. వరుణ్ తేజ్ చిత్రాలు మీడియం బడ్జెట్ లో తెరకెక్కుతూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా హీరోలు, దర్శకులు, నిర్మాతలు అంతా తమ చిత్రాల షూటింగ్స్ వాయిదా వేసుకుని ఇంట్లో కూర్చున్నారు.
వరుణ్ తేజ్ ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఖాళీగా ఉండడంతో వరుణ్ తేజ్ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించాడు. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిచ్చాడు.
ఇదిలా ఉండగా దర్శకుడు హరీష్ శంకర్ చిలిపిగా వరుణ్ కి ఓ ప్రశ్న సంధించాడు. హాయ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. నీ లాస్ట్ క్రష్ ఎవరు ? అని ప్రశ్నించాడు. దీనికి వరుణ్ తనదైన శైలిలో తెలివిగా సమాధానం ఇచ్చాడు. 'నా లాస్ట్ క్రష్ న చివరి చిత్రం గద్దలకొండ గణేష్ దర్శకుడు' అని వరుణ్ సమాధానం ఇచ్చాడు.
దీనితో వరుణ్ హరీష్ పై ఫన్నీగా పంచ్ వేసినట్లు అయింది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ చిత్రం మంచి విజయం సాధించింది. హరీష్ శంకర్ తదుపరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.