దయచేసి ఆ సినిమా చూడండి.. కరోనాపై ఫైర్ బ్రాండ్ లేడి కమెండ్స్

Published : Mar 29, 2020, 08:09 AM ISTUpdated : Mar 29, 2020, 08:12 AM IST
దయచేసి ఆ సినిమా చూడండి.. కరోనాపై ఫైర్ బ్రాండ్ లేడి కమెండ్స్

సారాంశం

వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు వినగానే.. ఫైర్ బ్రాండ్ తమిళ నటి గుర్తుకు వస్తుంది. ఎలాంటి విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నైజం వరలక్ష్మీ శరత్ కుమార్ సొంతం.

వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు వినగానే.. ఫైర్ బ్రాండ్ తమిళ నటి గుర్తుకు వస్తుంది. ఎలాంటి విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నైజం వరలక్ష్మీ శరత్ కుమార్ సొంతం. వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. తమిళనాడులో ఆయన ఒకప్పటి స్టార్ హీరో మాత్రమే కాదు.. ప్రస్తుతం పేరుమోసిన పొలిటీషియన్ కూడా. 

అతడి కుమార్తెగా వరలక్ష్మీ చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిగా దూసుకుపోతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ జన జీవితాల్ని స్తంభింపజేస్తోంది. ఇలాంటి తరుణంలో సెలెబ్రిటీలు విరాళాలు, అవేర్నెస్ పెంచేలా కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా కరోనా వైరస్ గురించి స్పందించింది. ఇలాంటి వైరస్ లు ఎంత వేగంగా వ్యాపిస్తాయో తెలియాలంటే ప్రతి ఒక్కరూ ఆంగ్లంలోని కాంటేజేయన్ అనే చిత్రం చూడండి. అందులో వైరస్ వ్యాప్తిని చక్కగా చూపించారు. కొందరు ఈ వైరస్ మనకు వ్యాప్తి చెందదు అనే నిర్లక్ష్యంతో ఉంటారు. అది కరెక్ట్ కాదు. 

నేను ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాను. బయట తిరగడం లేదు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ ఇలాగేచేయాలి అని వరలక్ష్మీ అభిమానులని కోరింది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?