పని మనిషిపై ప్రముఖ రచయిత అత్యాచారం.. ఫైర్‌ అయిన చిన్మయి

By Satish ReddyFirst Published Mar 28, 2020, 6:35 PM IST
Highlights

బ్రౌన్‌ హిస్టరీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పాబ్లో నెరుడా జీవిత కథకు సంబంధించి ఓ అంశాన్ని పోస్ట్ చేశారు. అందులో ఉన్న సమాచారం ప్రకారం చీలి దేశపు రచయిత పాబ్లో నెరుడా బయోగ్రఫీ మెమైర్స్ ఆఫ్ పాబ్లో నెరుడా అనే పుస్తకంలో ఓ సంచలన విషయాన్ని రాసినట్టుగా వెల్లడించారు.

సౌత్ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న వివాదాస్ప గాయని చిన్మయి శ్రీపాద. సినీ రంగంలో జరుగుతున్న లైగింక దాడుల విషయంలో తీవ్ర విమర్శలు చేయటంతో పాటు ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తమిళ ఇండస్ట్రీలో పెనుదుమారం రేపాయి. తాజాగా ఆమె మరో వివాదాస్పద అంశంపైనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నోబుల్‌ ప్రైజ్‌ సాదించిన అంతర్జాతీయ రచయిత పాట్లో నెరుడా బయోగ్రాఫిలోని ఓ అంశంపై చిన్మయి తీవ్ర స్థాయిలో స్పందించారు.


బ్రౌన్‌ హిస్టరీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పాబ్లో నెరుడా జీవిత కథకు సంబంధించి ఓ అంశాన్ని పోస్ట్ చేశారు. అందులో ఉన్న సమాచారం ప్రకారం చీలి దేశపు రచయిత పాబ్లో నెరుడా బయోగ్రఫీ మెమైర్స్ ఆఫ్ పాబ్లో నెరుడా అనే పుస్తకంలో ఓ సంచలన విషయాన్ని రాసినట్టుగా వెల్లడించారు. `తాను శ్రీలంకలో పర్యటించినప్పుడు ఓ తమిళ పని మనిషిపై అత్యాచారం చేసినట్టుగా నెరుడా రాసుకున్నట్టుగా వెల్లడించారు. తరువాత ఆ ఘటనపై ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టుగా కూడా వెల్లడించారు.


ఆ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ కావటంతో చిన్మయి కూడా స్పందించారు. `నెరూడా తమిళ పనిమనిషిపై రేప్ చేసిన ఘటన గురించి చదివాను. శ్రీలంక పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ఈ దారుణానికి పాల్పడ్డాడు. తప్పు చేసిన తరువాత తన ఆత్మకథ పుస్తకం రాసే సమయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేయటం ఎంతవరకు సమజసం. నోబుల్ లాంటి అత్యున్నత పురస్కారం అందుకున్న  రచయిత తాను ఇలాంటి పని చేశానని ప్రకటించుకోవచ్చా.? అలాంటి వ్యక్తినీ ఇంకా మహానుభావుడిగా చూడటం మన ఖర్మ` అంటూ ఘాటుగా విమర్శించింది చిన్మయి.

Got to know today that celebrated poet Pablo Neruda raped his Tamil housekeeper when he was in Sri Lanka as a diplomat and wrote about it in his memoirs.

Source - Memoirs of Pablo Neruda. https://t.co/FBGQUff04n

— Chinmayi Sripaada (@Chinmayi)
click me!