మరో సంక్రాంతిని బుక్ చేసుకున్న త్రివిక్రమ్

prashanth musti   | Asianet News
Published : Jan 20, 2020, 02:18 PM IST
మరో సంక్రాంతిని బుక్ చేసుకున్న త్రివిక్రమ్

సారాంశం

త్రివిక్రమ్ చాలా రోజుల అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా బన్నీ కెరీర్ కి కూడా మంచి సక్సెస్ ఇవ్వడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ చేస్తున్నారు.

ఫైనల్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చాలా రోజుల అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా బన్నీ కెరీర్ కి కూడా మంచి సక్సెస్ ఇవ్వడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ చేస్తున్నారు.

అయితే నెక్స్ట్  మాటల మాంత్రికుడు ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తో ఒక కథను సెట్ చేసుకున్నాడని టాక్ వచ్చినప్పటికీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ లో ఆ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇకపోతే త్రివిక్రమ్ వచ్చే సంక్రాంతిని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ సిద్ధమైతే షూటింగ్ వెంటనే మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో రామ్ చరణ్ - తారక్ లు విప్లవ వీరులుగా కనిపించబోతున్నారు. ఇక RRR సినిమాకు సంబందించిన షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వస్తోంది.

మొదట జులై 30న రిలీజ్ చేస్తానని చెప్పిన రాజమౌళి ఇప్పుడు షూటింగ్ ఆలస్యం కారణంగా అక్టోబర్ కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.  దీంతో త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఎప్పుడు దొరుకుతాడు అనేది క్లారిటీ లేదు. జులై వరకు ఎన్టీఆర్ RRR ఎండ్ కార్డు పెడితే గనక వెంటనే త్రివిక్రమ్ తన ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి2021 సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. తారక్ త్రివిక్రమ్ కి ఎంతవరకు సపోర్ట్ చేస్తాడో చూడాలి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?